Sai Rajesh : బేబీ మూవీ డైరెక్టర్.. ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవాడో తెలిస్తే.. నవ్వకుండా ఉండలేరు..
బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ ని ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేవారు అని ప్రశ్నించగా, దానికి అతను ఇచ్చిన సమాధానం విని మీరు నవ్వకుండా ఉండలేరు.
- gum 95921
- Published On : October 26, 2023 / 12:49 PM IST
Baby movie director Sai Rajesh work before he coming into industry
Sai Rajesh : టాలీవుడ్ డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్.. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో మంచి పేరునే సంపాదించుకున్నాడు. హృదయ కాలేయం, కొబ్బరి మట్ట వంటి పేరడీ సినిమాలతో పాటు కలర్ ఫోటో వంటి ఎమోషనల్ లవ్ స్టోరీకి కథని అందించి ఇండస్ట్రీలో రైటర్‌గా మంచి పేరుని తెచ్చుకున్నాడు. ఈ సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. కలర్ ఫోటో సినిమాకి నేషనల్ అవార్డుని కూడా అందుకున్నాడు. ఇక ఈ ఏడాది దర్శకుడిగా పరిచయం అవుతూ ‘బేబీ’ మూవీని తెరకెక్కించాడు.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ దర్శకుడు కథని అందిస్తూ తన ఫ్రెండ్ ని దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడు. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ దర్శకుడు తన ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈక్రమంలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ వచ్చాడు. ఇక ఒక అభిమాని సాయి రాజేష్‌ని.. ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారు..? అని ప్రశ్నించాడు.
Also read : Karan Johar : నా లైంగిక సమస్యని షారుఖ్ ఖాన్ అర్ధం చేసుకున్నాడు..
దీనికి సాయి రాజేష్ బదులిస్తూ.. ‘నా చదువు, లైఫ్, కెరీర్ పోయినాసరే టాలీవుడ్ బాగుండాలని ఫ్యాన్ వార్స్ చేసేవాడిని’ అంటూ సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సమాధానం నెట్టింట వైరల్ అవుతుంది. సాయి రాజేష్ చిరంజీవికి వీరాభిమాని అని, చిరు కోసం చొక్కాలు చించుకునేవాడిని అని చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ఇక మరో నెటిజెన్ సాయి రాజేష్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఎందుకు తప్పుకున్నారు అని ప్రశ్నించగా, దానికి బదులిస్తూ.. ‘మూడు నెలలు లాగ్ ఇన్ అవ్వలేదు. దీంతో వాళ్ళే తీసేశారు’ అంటూ తెలియజేశాడు.
