×
Ad

Baby Movie : బేబీ సినిమాకు 5 ఫిలింఫేర్ అవార్డులు.. నిర్మాత SKN ఎమోషనల్ ట్వీట్..

తాజాగా బేబీ సినిమా ఏకంగా 5 ఫిలింఫేర్ అవార్డులు సాధించింది.

  • Published On : August 4, 2024 / 02:21 PM IST

Baby Movie gets 5 Filmfare Awards Producer SKN Emotional Tweet goes Viral

Baby Movie : ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య మెయిన్ లీడ్స్ లో సాయి రాజేష్ దర్శకత్వంలో నిర్మాత SKN నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. గత సంవత్సరం జులైలో థియేటర్స్ లో రిలీజయిన ఈ సినిమా భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. కేవలం 10 కోట్లతో తెరకెక్కిన బేబీ సినిమా ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

తాజాగా బేబీ సినిమా ఏకంగా 5 ఫిలింఫేర్ అవార్డులు సాధించింది. 69వ సౌత్ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ ఈవెంట్ నిన్న రాత్రి గ్రాండ్ గా హైదరాబాద్ లో జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమల అవార్డ్స్ ని ప్రకటించగా అన్ని పరిశ్రమల నుంచి చాలా మంది సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. 69వ సౌత్ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ లో బేబీ సినిమాకు.. బెస్ట్ సినిమా క్రిటిక్స్, బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ (వైష్ణవి చైతన్య), బెస్ట్ మేల్ సింగర్ – శ్రీరామచంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా), బెస్ట్ లిరిసిస్ట్ – అనంత్‌ శ్రీరామ్‌ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – విజయ్‌ బుల్గానిన్‌ అవార్డులు వచ్చాయి.

Also Read : Tollywood Friendships : ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. సినీ పరిశ్రమలో వీళ్ళ ఫ్రెండ్‌షిప్ చాలా స్పెషల్ గురూ..

దీంతో బేబీ టీమ్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ అవార్డులపై స్పందిస్తూ నిర్మాత SKN ఎమోషనల్ ట్వీట్ చేసాడు. నిర్మాత SKN తన ట్వీట్ లో.. ఒక చిన్న బడ్జెట్ సినిమా, కొత్త వాళ్ళు, 100 కోట్ల బిజినెస్, ఫిలింఫేర్ లో 8 నామినేషన్స్ లో 5 అవార్డులు, బాలీవుడ్ లో రీమేక్ కాబోతుంది. ఇంతకంటే ఏం కావలి. మా కెరీర్స్ లో బేబీ సినిమా మర్చిపోలేనిది. బేబీ టీమ్ కి సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేసాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవ్వగా SKN కి కంగ్రాట్స్ చెప్తున్నారు.