Baby OTT Release : ‘బేబీ’ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అప్డేట్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా‘బేబీ’. జూలై 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- August 17, 2023 / 09:05 PM IST
Baby OTT Release
Baby OTT : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా‘బేబీ’. సాయి రాజేశ్ (Sai Rajesh) దర్శకత్వంలో శ్రీనివాస కుమార్ (SKN) ఈ చిత్రాన్ని నిర్మించారు. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా యువతను బాగా ఆకట్టుకుంది. దాదాపు రూ.80 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
Bhola shankar : మెగాస్టార్ చిరంజీవితో వివాదం.. స్పందించిన భోళాశంకర్ నిర్మాత.. రూమర్స్‌కు చెక్
జూలై 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ స్పందించిన అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అయితే.. ఏ రోజు స్ట్రీమింగ్ కానుందనే విషయాన్ని మాత్రం రేపు(ఆగస్టు 18న) చెబుతామంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. “ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. చేరేను ‘ఆహా’లోనా.. క్యూట్ లవ్ స్టోరీ ‘బేబి’ రిలీజ్ డేట్ పై ప్రకటన రేపు వస్తుంది.” అని ఆహా ట్వీట్ చేసింది. దీంతో అసలు ఈ చిత్రం ఏ ఓటీటీలో వస్తుంది అన్న ప్రశ్నకు సమాధానం అయితే దొరికింది.
కథ ఏంటంటే..?
వైష్ణవి (వైష్ణవి చైతన్య) ఓ బస్తిలో నివసిస్తుంటుంది. చిన్నప్పటి నుంచి అదే బస్తీలో తన ఎదురుఇంటిలో ఉంటున్న ఆనంద్(ఆనంద్ దేవరకొండను) ప్రేమిస్తుంటుంది. స్కూల్ డేస్‌లోనే వీరిద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. కాగా.. పదో తరగతి ఫెయిల్ కావడంతో ఆనంద్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. వైష్ణవి ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్ కాలేజీకి వెలుతుంది. అక్కడ ఏర్పడిన కొత్త పరిచయాల వల్ల ఆమె ఆలోచన విధానం మారుతుంది. ఈ క్రమంలో తన క్లాస్మేట్ అయిన విరాజ్‌కు దగ్గర అవుతుంది. అనుకోకుండా వైష్ణవి, విరాజ్‌లు ఇద్దరూ శారీరకంగా దగ్గర అవుతారు. ఆ తరువాత ఏమైంది..? ఈ విషయం ఆనంద్‌కు తెలిసిందా..? వాస్తవం తెలుసుకున్న ఆనంద్ ఎలా స్పందించాడు..? ఆనంద్, విరాట్ ఇద్దరిలో వైష్ణవి ఎవరిని ప్రేమించింది..? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Lokesh Kanagaraj : కాస్ట్ లీ కారు కొన్న లోకేష్ కనగరాజ్.. ఎన్ని కోట్లంటే..?
