Baby OTT Release Date : బేబీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా‘బేబీ’. ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
- Thota Vamshi Kumar
- Published On : July 25, 2023 / 04:26 PM IST
Baby OTT
Baby OTT Release : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా‘బేబీ’. ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా జూలై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. రెండో వారంలోనూ మంచి వసూళ్లను సాధిస్తోంది. రూ.60 కోట్లపైనే గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.
Thaman : తమన్‌ను టార్గెట్ చేస్తున్న మహేశ్, మెగా ఫ్యాన్స్.. ఎందుకిలా..?
ఇటీవల ఎంత పెద్ద సినిమా అయినా విడుదలైన వారంలోనే ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందనే విషయం దాదాపుగా తెలిసిపోతుంది. అయితే.. బేబీ ఓటీటీ విషయంలో మొదట్లో కాస్త గందరగోళం నెలకొంది. ఆగస్టు మొదటి వారంలో విడుదల చేయాలని మేకర్స్ బావించారు. అయితే.. హౌస్‌పుల్ కలెక్షన్లతో దూసుకువెలుతుండడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఆగస్టు చివరి వారం లేదంటే సెప్టెంబర్ తొవి వారంలో విడుదల చేస్తారనే వార్తలు వినిపించాయి. అయితే.. తాజాగా ఆగస్టులో విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
Baby Actress Kirrak Seetha : కిర్రాక్ సీతకు అత్యాచార బెదిరింపులు.. ఆ రోజు కొందరు పాలో అయ్యారు..
ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 18 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి ఇదే శుభవార్తే కానుంది. సాయి రాజేశ్ దర్శకత్వంలో ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.
