Producer SKN : రోజూ ట్రోల్స్.. సోషల్ మీడియాలో వైరల్.. కానీ SKN కష్టాల గురించి మీకు తెలుసా?
బేబీ సినిమా సక్సెస్ తో నిర్మాత SKN ఒక్కసారిగా మరోసారి వైరల్ అవుతున్నారు. SKN గతంలో కొన్ని సినిమా ఈవెంట్స్ లో వైరల్ స్పీచ్ లతో బాగా పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియాలో అతనిపై బాగా మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి.
- Saketh U
- Published On : July 22, 2023 / 10:08 AM IST
Baby Producer SKN Sreenivasa Kumar Naidu Real Life Story goes viraal
Producer SKN : SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), ప్రధాన పాత్రల్లో వచ్చిన బేబీ సినిమా జులై 14న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయి భారీ విజయం సాధించింది. ఎంతోమంది ప్రేక్షకులతో పాటు చాలా మంది స్టార్ సెలబ్రిటీలు బేబీ సినిమాని అభినందించారు. ఇప్పటికే ఈ సినిమా వారం రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవలే అల్లు అర్జున్ స్వయంగా సినిమా చూసి బేబీ సినిమాని అభినందించడానికి ప్రత్యేకంగా ఈవెంట్ కూడా పెట్టాడు.
బేబీ సినిమా సక్సెస్ తో నిర్మాత SKN ఒక్కసారిగా మరోసారి వైరల్ అవుతున్నారు. SKN గతంలో కొన్ని సినిమా ఈవెంట్స్ లో వైరల్ స్పీచ్ లతో బాగా పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియాలో అతనిపై బాగా మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. కానీ SKN అవేమి పట్టించుకోలేదు. SKN స్పీచ్ లతో, అతని రియాక్షన్స్ తో బాగా వైరల్ అయినా, ఇప్పుడు బేబీ సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టినా ఇవి మాత్రమే మనకు తెలుసు కానీ SKN కష్టాలు ఎవ్వరికి తెలీవు.
ఇటీవల అల్లు అర్జున్ ఏర్పాటు చేసిన అభినందన సభలో అల్లు అర్జున్ SKN గురించి, అతని కష్టాలు గురించి మాట్లాడాడు. SKN కూడా స్వయంగా బేబీకి ముందు తన కష్టాల గురించి తెలిపాడు. గోదావరి జిల్లాల్లో చిరంజీవి వీరాభిమానిగా SKN అందరికి పరిచయం అయ్యాడు. SKN అసలు పేరు శ్రీనివాస్ కుమార్ నాయిడు. అలా బన్నీవాసుకి పరిచయం అయితే ఆయన హైదరాబాద్ రమ్మన్నాడు. అప్పటికి అల్లు అర్జున్ ఇంకా హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి అని అడిగితే చిరంజీవి గారి డ్యాన్స్ షెడ్ పక్కన ఒక రూమ్ లో ఉండమని చెప్పాడు. ఆ తర్వాత ఒక ఛానల్ లో జర్నలిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత సినిమా PR అయి, ఆ తర్వాత బన్నీ వాసు, మారుతి పరిచయాలతో మేనేజర్, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్ గా మారి అనంతరం ప్రొడ్యూసర్ గా మారారు.
హైదరాబాద్ కి చాలా ఏళ్ళు సినీ పరిశ్రమలో ఉన్నా, చాలా సినిమాలకు పనిచేసినా సొంత ఇల్లు కూడా కొనుక్కోలేకపోయారు. బేబీ సినిమాకు ముందు ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు. త్వరలోనే గృహప్రవేశం పెట్టుకుందాం అనుకున్నారు. బేబీ సినిమాతో ఎలాగైనా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలి, డబ్బులు రావాలి, హిట్ కొట్టాలి అనుకున్నారు. బేబీ సినిమా 50 రోజుల్లో తీద్దాం అనుకుంటే మూడు ఏళ్ళు పట్టింది. లొకేషన్ ప్రాబ్లమ్ వల్ల కొంచెం చేసిన షూట్ అంతా వేస్ట్ అయింది. అనుకున్న బడ్జెట్ లో అవ్వకపోవడంతో కొనుక్కున్న ఫ్లాట్ గృహప్రవేశం అవ్వకముందే అమ్మేశాడు. ఇంట్లో వాళ్ళు తిట్టినా సినిమా కోసం నిలబడ్డాడు. అల్లు అరవింద్ గారి దగ్గర అప్పు తీసుకొని సినిమా పూర్తి చేసి ఇప్పుడు బేబీ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు PR గా పనిచేశాడు. అల్లు అరవింద్, అల్లు అర్జున్, గీత ఆర్ట్స్ టీం అందరికి మంచి స్నేహితుడిగా, నమ్మిన బంటుగా ఉంటూ వచ్చారు.
Baby Movie : బేబీ సరోకొత్త రికార్డు.. 50 కోట్ల కలెక్షన్స్.. వారం రోజుల్లోనే..
అల్లు అర్జున్ తనకు ఒక కెరీర్ ఇచ్చారని, ప్రతి దశలోనూ సపోర్ట్ చేశారని అతనే నాకు దేవుడు అని కూడా తాజాగా జరిగిన బేబీ ఈవెంట్ లో చెప్పాడు SKN. బన్నీ కూడా SKN ని అభినందించి, అతని కష్టాల గురించి చెప్పి, అతనికి సినిమా మీద ఉన్న పిచ్చి గురించి చెప్పి దగ్గరకు పిలిచి హత్తుకున్నాడు. దీంతో SKN మరోసారి వైరల్ అవుతున్నారు. అంత కష్టపడి పైకి వచ్చినందుకు అభినందిస్తున్నారు. త్వరలో SKN నిర్మాణంలోనే మరిన్ని సినిమాలు రానున్నాయి.
