Bhagavanth Kesari : బాలయ్య బర్త్ డేకి బిగ్ సర్ప్రైజ్ రెడీ చేసిన డైరెక్టర్.. టీజర్ ట్రీట్
నందమూరి బాలకృష్ణ 108వ సినిమా టైటిల్ ని ‘భగవంత్ కేసరి’ అని అనౌన్స్ చేశారు. ఇక పుట్టినరోజు నాడు మరో బిగ్ సర్ప్రైజ్..
- gum 95921
- Updated on- June 8, 2023 / 06:44 PM IST
Balakrishna Bhagavanth Kesari teaser or glimpse released on hi birthday
Balakrishna Bhagavanth Kesari : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 108వ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నేడు ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ టైటిల్ లో భగవంత్ అంటే విష్ణువు అని, కేసరి అంటే హిందీలో సింహం అనే అర్ధమట. అలాగే ‘ఐ డోంట్ కేర్’ అనే పవర్ ఫుల్ ట్యాగ్ లైన్ ని కూడా పెట్టారు. ఇక ఈ టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఆకట్టుకుంటుంది. తాజాగా మూవీ టీం మరో అదిరిపోయే అప్డేట్ ని ఇచ్చారు.
Dimple Hayathi : తన పై కేసుని కొట్టేయాలి.. హైకోర్టుని ఆశ్రయించిన డింపుల్..
ఈ శనివారం (జూన్ 10) బాలకృష్ణ పుట్టినరోజు నాడు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలియజేస్తూ ఒక ఫోటో షేర్ చేశాడు. దానితో పాటు థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ అదిరిపోయిందని కామెంట్ కూడా చేశాడు. బర్త్ డేకి పవర్ ఫుల్ టీజర్ రెడీ చేశాడు. 108 థియేటర్లలో టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చెప్పాడు. కాగా ఈ సినిమా తెలంగాణ బ్యాక్‌డ్రాప్ తో ఉండబోతుంది.
Yash – Ranbir : అల్లు అరవింద్ నిర్మాణం.. యశ్ రావణుడు.. రణ్‌బీర్, అలియా సీతారాములు.. నిజమేనా?
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీలీల (Sreeleela) ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమాని దసరా కానుకగా తీసుకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే మూవీ నుంచి రిలీజ్ డేట్ పై క్లారిటీ రాలేదు. కాగా బాలయ్య గత రెండు సినిమాలు అఖండ, వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమాతో కూడా హిట్టు కొట్టి హ్యాట్రిక్ అందుకుంటాడా? లేదా? చూడాలి.
