Balakrishna : ఒకే వేదికపైకి చంద్రబాబు, రేవంత్‌.. పుట్టిన రోజు నాడు బాలయ్య కీలక ప్రకటన..

నేడు బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను బసవతారకం హాస్పిటల్ లో నిర్వహించారు. (Balakrishna)

  • Published on- June 10, 2026 / 12:09 PM IST

Balakrishna

Balakrishna : నేడు బాలకృష్ణ పుట్టిన రోజు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హీరోగా సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో ఎమ్మెల్యేగా సేవలు అందిస్తూ మరోవైపు బసవతారకం హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అభినందనలు అందుకుంటున్నారు బాలయ్య.

నేడు బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను బసవతారకం హాస్పిటల్ లో నిర్వహించారు. ఈ వేడుకల్లో బాలయ్య మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు.

Also Read : Alpha Teaser : ‘ఆల్ఫా’ టీజర్ వచ్చేసింది.. అలియాభట్ యాక్షన్ అదరగొట్టేసిందిగా..

బాలకృష్ణ మాట్లాడుతూ.. జూన్ 22న బసవతారకం హాస్పిటల్ 25 ఏళ్ల వేడుకని హైదరాబాద్ హైటెక్స్ లో ఘనంగా నిర్వహించబోతున్నాము. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎంతోమంది సహకారంతో ఈ క్యాన్సర్ హాస్పిటల్ ని నడిపిస్తున్నాము. ఎంతోమంది రోగులకు చికిత్స అందిస్తున్నాము. అందుకే పాతికేళ్ల వేడుకను ఏం సాధించాం, సమాజానికి ఏం ఇచ్చాం, ఇంకా ఏమి చేయాలి అని నిర్వహిస్తున్నాము.

ఆ వేడుకకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అనుప్రియ పటేల్, ఏపీ, తెలంగాణ వైద్య శాఖ మంత్రులు హాజరు కాబోతున్నారు అని తెలిపారు.