Alpha Teaser : ‘ఆల్ఫా’ టీజర్ వచ్చేసింది.. అలియాభట్ యాక్షన్ అదరగొట్టేసిందిగా..
మీరు కూడా ఆల్ఫా టీజర్ చూసేయండి.. (Alpha Teaser)
Alpha Teaser
Alpha Teaser : బాలీవుడ్ భారీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి YRF స్పై సినిమాటిక్ యూనివర్స్ లో ఇప్పటికే అనేక సినిమాలు రాగా అలియాభట్ మెయిన్ లీడ్ గా గతంలో ఆల్ఫా అనే సినిమాని ప్రకటించారు. తాజాగా ఆల్ఫా టీజర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో బాబీ డియోల్, శార్వరి, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
టీజర్ చూస్తుంటే ఇండియాకు కావాల్సిన నెక్స్ట్ జనరేషన్ సోల్జర్స్ ని బాబీ డియోల్ తయారుచేసి అందులో బెస్ట్ అయిన అలియా భట్ తో ఆల్ఫా అనే ఓ మిషన్ ని చేయిస్తాడని తెలుస్తుంది. టీజర్ లోనే అలియాభట్ యాక్షన్ అదరగొట్టేసింది. ఇక సినిమాల్లో ఓ రేంజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. ప్రతి YRF సినిమాటిక్ యూనివర్స్ లో వేరే సినిమాల నుంచి ఎవరో ఒక హీరో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం మాములే. మరి ఈ సినిమాలో ఎవరు గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తారో చూడాలి.
Also Read : Khushbu Sundar : ఆమె కల తీర్చకుండానే మరణించిన భారతీరాజా.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్ ట్వీట్..
మీరు కూడా ఆల్ఫా టీజర్ చూసేయండి..
