Vijay – Rashmika : అన్‌స్టాపబుల్ షోలో విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమ కథకి క్లారిటీ వచ్చిందా..?
అన్‌స్టాపబుల్ షోలో విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమ కథకి క్లారిటీ వచ్చిందా..? బాలయ్య వారిద్దరి రిలేషన్ ని బయటపెట్టారా..? యానిమల్ ఎపిసోడ్ లో ఏం జరిగింది..?
- gum 95921
- Updated on- November 24, 2023 / 12:58 PM IST
Vijay Devarakonda Rashmika Mandanna gave clarity about their relationship in Unstoppable show
Vijay Devarakonda – Rashmika Mandanna : టాలీవుడ్ హీరోహీరోయిన్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫ్రెండ్సా..? లవర్సా..? అనే క్యూస్షన్ ఒక చిక్కుముడిలా ఉండిపోయింది. ఇక ఈ చిక్కుముడికి సొల్యూషన్ ని అన్‌స్టాపబుల్ షోలో బాలయ్య కనిపెడతారేమో అని అందరూ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి రష్మిక ‘యానిమల్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ వంగా డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ ముగ్గురు బాలయ్య అన్‌స్టాపబుల్ షో గెస్టులుగా వచ్చారు.
ఇక ఈ షోలో బాలకృష్ణ.. యానిమల్, అర్జున్ రెడ్డి పోస్టర్స్ చూపిస్తూ రణబీర్, విజయ్ లో ఎవరు బాగున్నారు అని రష్మికని ప్రశ్నించారు. దానికి రష్మిక బదులివ్వకపోవడంతో బాలయ్య.. సందీప్ వంగాని విజయ్ దేవరకొండకి ఫోన్ చేయమని చెప్పారు. సందీప్ చేసినప్పుడు విజయ్ ఫోన్ లైఫ్ చేయలేదు. ఆ తరువాత రష్మికని కాల్ చేయమని అడిగారు. దీంతో విజయ్ నెంబర్ ని ఫోన్ లో యేమని సేవ్ చేసుకుందో అడగండి అంటూ రణబీర్ చెప్పారు. కానీ రష్మిక ఏం చెప్పకుండా సిగ్గుపడింది. అర్జెంటు గా కాంటాక్ట్ పేరు మార్చేలంటూ తనలో తానే మాట్లాడుకుంది.
Also read : Prabhas : ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగా.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా..?
దీంతో ఆమె విజయ్ పేరుని ఏమని సేవ్ చేసుకుందో అనేది తెలియకుండానే మిగిలిపోయింది. కాగా రష్మిక ఫోన్ చేసినప్పటికీ విజయ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఫైనల్ గా సందీప్ మళ్ళీ చేయగా.. అప్పుడు కాల్ లిఫ్ట్ చేశారు. బాలకృష్ణ పోస్టర్స్ విషయం చెప్పి రష్మిక ఫోన్ ఇచ్చారు. అప్పుడు విజయ్, రష్మికతో ‘వాట్సాప్ రే’ అంటూ ముద్దుగా మాట్లాడడం, దానికి రష్మిక, విజయ్‌తో.. ‘ఫోన్ స్పీకర్ లో పెట్టారు. నాకేమి చెప్పాలో అర్థంకావడం లేదు’ అంటూ సిగ్గుపడుతూ నవ్వుకుంది.
ఆ తరువాత రణబీర్, విజయ్ తో మాట్లాడుతూ.. బాలయ్య లవ్స్ రష్మిక అంటున్నారు అని చెప్పారు. దానికి విజయ్ బదులిస్తూ.. ఆ విషయం నాకు తెలుసని చెప్పుకొచ్చారు. మరి నువ్వు ఎవరిని లవ్ చేస్తున్నావు అని బాలకృష్ణ విజయ్ ని ప్రశ్నించగా, విజయ్ బదులిస్తూ.. నేను సందీప్ ని లవ్ చేస్తున్నాను అంటూ చెప్పి మాటదాటేశాడు. దీంతో అన్‌స్టాపబుల్ షోలో కూడా ఆ చిక్కుముడి వీడలేదు. అయితే రష్మిక సిగ్గు పడడం చూస్తుంటే ఏదో ఉందనే అర్ధమవుతుంది. మరి వీరి బంధాన్ని ఎప్పుడు బయట పెడతారో చూడాలి.
