భ్రమరాంబ దగ్గర బాలయ్య ఫ్యాన్స్ హంగామా

థియేటర్ల దగ్గర బాలయ్య ఫ్యాన్స్ హంగామా..

  • Publish Date - February 21, 2019 / 10:22 AM IST

థియేటర్ల దగ్గర బాలయ్య ఫ్యాన్స్ హంగామా..

నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్- ఎన్టీఆర్ మహానాయకుడు.. మరికొద్ది గంటల్లో సిల్వర్ స్క్రీన్స్‌పై సందడి చెయ్యబోతుంది. ఫస్ట్ పార్ట్ అంతా ఎన్టీఆర్ సినిమా జీవితాన్ని చూసిన అభిమానులు, సెకండ్ పార్ట్ గురించి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రెండవ భాగం అంతా రాజకీయ నేపథ్యంలో సాగనుంది. బాలయ్య, అన్నగారి గెటప్‌లో అచ్చుగుద్దినట్టు సెట్ అయిపోయాడు. అన్నగారిలా మారిన బాలయ్యని వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ చాలా ఆత్రుతతో ఉన్నారు. బాలయ్యకి హైదరాబాద్ కూకట్‌పల్లిలో భారీగా అభిమానులున్నారు. తన ప్రతి సినిమాని రిలీజ్ నాడు, తెల్లవారు ఝామునే అభిమానులతో కలిసి చూడడం బాలయ్యకి చాలా ఇష్టం. అది ఆయనకి ఒక అలవాటుగా మారిపోయింది.

ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ సందర్భంగా కూకట్‌‌పల్లి ఫ్యాన్స్ హంగామా మొదలు పెట్టేసారు. ఎన్.బి.కె.సేవాసమితి, కర్నాటి కొండలరావు ఆధ్వర్యంలో, భ్రమరాంబ, మల్లిఖార్జున థియేటర్ల వద్ద భారీ సైజులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. ఫస్ట్ పార్ట్‌తో కంపేర్ చేస్తే, ఎమోషనల్‌గా సాగే  సెకండ్ పార్ట్ ఫ్యాన్స్‌ని, ఆడియన్స్‌ని మరింతగా ఆకట్టుకుంటుందని బాలయ్య అభిమానులు ధీమాగా చెప్తున్నారు. మరి కొన్ని గంటల్లో మహానాయకుడు ప్రపంచ వ్యాప్తంగా వెండితెరపై కనువిందు చెయ్యనున్నాడు. 

వాచ్ ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్…