Unstoppable With NBK: రౌడీ హీరోతో బాలయ్య సంక్రాంతి సందడి..!
నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండతో థియేటర్లను, బాక్సాఫీస్ ను దద్దరిల్లేలా చేసి.. అదే ఊపులో డిజిటల్ లో కూడా దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. అచ్చ తెలుగు ఓటీటీగా పేరు తెచ్చుకున్న ఆహా..
- Naresh Mannam
- Published On : January 8, 2022 / 08:41 PM IST
Unstoppable With Nbk
Unstoppable With NBK: నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండతో థియేటర్లను, బాక్సాఫీస్ ను దద్దరిల్లేలా చేసి.. అదే ఊపులో డిజిటల్ లో కూడా దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. అచ్చ తెలుగు ఓటీటీగా పేరు తెచ్చుకున్న ఆహా.. బాలయ్యతో అన్ స్టాపబుల్ షో ప్రకటన నుండి ప్రతి ఎపిసోడ్ వేరే లెవెల్ లోనే సెట్ చేస్తుంది. బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్.. టైటిల్ కి యాప్ట్ అయ్యేలా బాలయ్య ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా అన్ స్టాపబుల్ షోతో అదరగొడుతున్నారు బాలయ్య.
India’s Biggest Film: బాహుబలి తర్వాత ఫీట్ సాధించిన తెలుగు సినిమా ‘పుష్ప’!
అన్ స్టాపబుల్ ని టైటిల్ కి తగినట్టే నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ అన్ స్టాపబుల్ గా షోని నడిపిస్తున్నారు బాలకృష్ణ. ఇప్పటి వరకూ ఒకలెక్క.. ఇప్పటి నుంచి ఒకలెక్క అనేలా స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ ఎపిసోడ్స్ రెడీ చేస్తున్నారు బాలయ్య. మంచు ఫ్యామిలీ, నానీ, రవితేజ, మహేష్, అల్లు అర్జున్, రాజమౌళి, రానా ఇలా వరసగా సెలబ్రిటీలతో ఫన్నీ బాంబ్స్ పేల్చేసిన బాలయ్య ఇప్పుడు రౌడీ హీరోతో చేసిన హంగామాను చూపించనున్నారు.
S.Thaman: బీజీఎం స్పెషలిస్ట్ థమన్.. స్పెషల్ ఆఫర్లు ఇస్తున్న మేకర్స్!
చాలా రోజుల క్రితమే విజయ్ తో అన్ స్టాపబుల్ షో అని బయటకొచ్చింది. బాలయ్యతో విజయ్ దేవరకొండ షో అనగానే ఈ సౌండింగ్ నే వేరే లెవెల్లో ఉంది. ఈ ఎపిసోడ్ గురించి ఇటు బాలయ్య అభిమానులతో పాటు విజయ్ అభిమానులలో ఆసక్తి మొదలైంది. రౌడీ ఒక్కడే కాదు దర్శకుడు పూరి జగన్నాధ్, నటి, నిర్మాత చార్మీ కూడా ఈ ఎపిసోడ్ లో పాల్గొనగా సంక్రాంతి స్పెషల్ గా జనవరి 14న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక ఈ ఎపిసోడ్ ఇంకెంత ఎనర్జిటిక్ గా ఉంటుందో మీరే అర్ధం చేసుకోవచ్చు.
