S.Thaman: బీజీఎం స్పెషలిస్ట్ థమన్.. స్పెషల్ ఆఫర్లు ఇస్తున్న మేకర్స్!

ఒక సినిమా పోస్ట్ పన్ అయితే మరో ఛాన్స్ అందుకుంటున్నాడు థమన్. అదీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో. అవును బీజీఎం ఇరగదీస్తుండటంతో తమన్ కి స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు మేకర్స్.

S.Thaman: బీజీఎం స్పెషలిస్ట్ థమన్.. స్పెషల్ ఆఫర్లు ఇస్తున్న మేకర్స్!

S.thaman

S.Thaman: ఒక సినిమా పోస్ట్ పన్ అయితే మరో ఛాన్స్ అందుకుంటున్నాడు థమన్. అదీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో. అవును బీజీఎం ఇరగదీస్తుండటంతో తమన్ కి స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు మేకర్స్. అందులో స్పెషలిస్ట్ గా గుర్తిస్తున్నారు. ఇప్పటికే చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న తమన్.. ఈ కొత్త పదవిని డిఫరెంట్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

Crazy Combinations: కాంబో సెట్టయ్యిందా.. మళ్ళీ వాళ్ళతోనే మరో సినిమా!

ఈమధ్య టాలీవుడ్ ను ఊపేస్తోన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్. పాటలే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లోనూ దిట్టా అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం తమన్ చేతిలో చిన్నా, పెద్దా సినిమాలు కలిపి 20కి పైగానే సినిమాలున్నాయి. తమన్ స్టార్స్ కిచ్చిన ఏ పాట రిలీజ్ చేస్తే.. ఆ పాట హిట్టై ట్రెండ్ అవుతోంది. అయితే టక్ జగదీశ్ కి అన్ని పాటలిచ్చి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వని ఈ మ్యూజిక్ డైరెక్టర్ ని ఇప్పుడదే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు మేకర్స్.

Nidhhi Agerwal: తమిళ హీరోతో నిధి ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి?

అఖండకు పవర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి బాక్స్ లు బద్దలయ్యేలా చేసిన తమన్ కు ఇప్పుడు ఇండస్ట్రీ సపరేట్ స్టేటస్ ఇచ్చింది. అఖండకు ముందు కూడా తమన్ బీజీఎం బాగుంటుందనే పేరుంది. అయితే అఖండకొచ్చిన బూస్టప్ తో మిగిలిన మేకర్స్ తమన్ వెంటపడుతున్నారు. ప్రభాస్ రాధేశ్యామ్ పాటలకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేశారు. వాళ్ల ముగ్గురిని కాదని కేవలం బ్యాక్ గ్రౌండ్ కోస తమన్ కి స్పెషల్ ఆఫర్ ఇచ్చారు.

Pan India Films: పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్.. స్ట్రాటజీ ఏంటంటే?

అయితే ఇక్కడే.. ఈమధ్యే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో గమ్మత్తు చోటుచేసుకుంది. నిజానికి గత డిసెంబర్ నెలలో భీమ్లా నాయక్ నేపథ్య సంగీతం ఇవ్వాల్సింది తమన్. కానీ అనూహ్యంగా భీమ్లా నాయక్ ఫిబ్రవరికెళ్లడంతో రాధేశ్యామ్ కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేసాడీ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు మళ్లీ ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో రాధేశ్యామ్ కూడా వాయిదాపడింది. దీంతో వెల్కమ్ ది మ్యూజికల్ సెన్సేషన్ తమన్ ఎస్ ఫర్ ది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు డిజె టిల్లు మేకర్స్.

Heroins: క్యారక్టర్ కోసం హోమ్ వర్క్.. ప్రెస్టీజియస్‌గా తీసుకుంటున్న హీరోయిన్స్

సిద్ధార్ద్ జొన్నలగడ్డ హీరోగా వస్తోన్న డిజె టిల్లుని నిర్మిస్తోంది సితార ఎంటర్ టైన్మెంట్స్. త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ లాంటిదది. సో అడగ్గానే డిజె టిల్లు బ్యాక్ గ్రౌండ్ కి ఎస్ చెప్పేశాడు తమన్. అయితే సంక్రాంతికనుకున్న భీమ్లా నాయక్ కోసం తమన్ వర్క్ చేస్తున్న టైమ్ లో అది వాయిదాపడింది. అదే సంక్రాంతికి వస్తుందనుకున్న రాధేశ్యామ్ బోర్డ్ తమన్ ఎక్కితే.. అదీ పండుగ రేస్ నుంచి తప్పుకుంది. ఇప్పుడు చివరికి పెద్ద పండక్కే రాబోతున్న డిజె టిల్లుకి వర్క్ చేయాల్సి వస్తోంది తమన్. ఇదే సంక్రాంతికి తమన్ సంగీతం అందించిన సూపర్ మచ్చి కూడా రాబోతుంది.

Film Celebrities: సెలబ్రిటీలను చుట్టేస్తున్న కరోనా.. ఉదృతంగా వ్యాప్తి!

పాటలూ సూపర్ హిట్ ఇస్తున్నాడు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అంతకుమించి అనిపిస్తున్నాడు. సో తమన్ ని స్టార్స్ సినిమాల ఆఫర్స్ దంచికొడుతున్నాయి. ప్రస్తుతం భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్, గని, సర్కారు వారి పాట, థ్యాంక్యూ, బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమాలున్నాయి. అటు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా తెరకెక్కతోన్న రామ్ చరణ్-శంకర్, విజయ్-వంశీ పైడిపల్లి, శివకార్తికేయన్-అనిరుథ్, మహేశ్-త్రివిక్రమ్ ప్రాజెక్టులకు మ్యూజిక్ కంపోజ్ చేసిది కూడా తమనే.