NBK 111: బాలకృష్ణ- గోపీచంద్ మలినేని మూవీ కోసం మ్యాజికల్ కాంబో.. మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని(NBK 111) మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి.
- V Santhosh Kumar
- Published On : April 13, 2026 / 04:23 PM IST
Balakrishna, Gopichand Malineni movie Music sittings started
- బాలకృష్ణ సినిమాకు తమన్ మ్యూజిక్
- మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ఫినిష్
- రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైన సాంగ్ షూట్
NBK 111: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. వీరసింహా రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ఈ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలయ్యింది. అయితే, తాజాగా ఈ ప్రాజెక్ట్ సంబందించిన మ్యూజిక్ పనులు కూడా మొదలయ్యాయట. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఇప్పటికే రెండు ట్యూన్స్‌ను సిద్ధం చేయగా, అందులో ఒక పాటను ప్రముఖ రచయిత అనంత్ శ్రీరామ్ రాసినట్లు సమాచారం.
Ananya Nagalla: క్రేజీ బైక్.. అదిరిపోయే లుక్.. హాట్ ఫిగర్‌తో సెగలు పుట్టిస్తున్న అనన్య నాగళ్ళ ఫొటోలు
ఈ ప్రత్యేక గీతాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ మధ్య(NBK 111) చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. త్వరలోనే ఈ సాంగ్ షూట్ కూడా మొదలుకానుంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో సింహా, శ్రీరామ రాజ్యం, జై సింహా వంటి విజయవంతమైన చిత్రాల్లో మెరిసిన ఈ హిట్ జోడీ, మరోసారి వెండితెరపై మాయ చేసేందుకు సిద్ధమైంది.
నిర్మాత సతీష్ కిలారు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాటల చిత్రీకరణ ముగిసిన వెంటనే అక్కడే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ప్లాన్ చేశారు. గోపీచంద్ మలినేని మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగిన పవర్‌ఫుల్ డైలాగులు, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తాయని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
