Balakrishna : బాబాయ్ కోసం ఇద్దరు అబ్బాయిలు.. త్వరగా కోలుకోవాలి బాల బాబాయ్ అంటూ.. ట్వీట్స్ వైరల్..
ఈ క్రమంలో బాలకృష్ణ త్వరగా కోలుకోవాలంటూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్స్ చేయడం విశేషం. (Balakrishna)
- Saketh U
- Published on- July 21, 2026 / 04:07 PM IST
Balakrishna
Balakrishna : నేడు బాలకృష్ణ సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. NBK111 సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది. మంచు మనోజ్, బాలకృష్ణ మధ్య కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో బాలయ్య మోకాలికి గాయమైంది. ఆస్పత్రికి తరలించగా వైద్యులు చిన్న సర్జరీ చేయాలని సూచించి చికిత్స మొదలుపెట్టారు. దీంతో అభిమానులు, పలువురు సెలబ్రిటీలు బాలయ్య త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ఈ క్రమంలో బాలకృష్ణ త్వరగా కోలుకోవాలంటూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ట్వీట్స్ చేయడం విశేషం. కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ – బాలయ్య మధ్య దూరం పెరిగిందని వార్తలు వచ్చాయి. నేడు ఈ ట్వీట్స్ తో నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటే అని మరోసారి చాటి చెప్పారని అంటున్నారు ఫ్యాన్స్.
ఎన్టీఆర్ తన ట్వీట్ లో.. బాలా బాబాయ్ త్వరగా కోలుకోండి. మీరు త్వరగా ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు పూర్తి ఉత్సాహంతో తిరిగి పుంజుకోవడం చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని పోస్ట్ చేసారు. ఇక కళ్యాణ్ రామ్.. త్వరగా కోలుకోండి బాబాయ్. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీకు అత్యంత ఇష్టమైన పనుల్లో మీరు అతి త్వరలోనే తిరిగి నిమగ్నమవుతారని నాకు నమ్మకం ఉంది అని రాసుకొచ్చారు. దీంతో వీరి ట్వీట్స్ వైరల్ గా మారాయి.
