Balakrishna : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోకి బాలయ్య ఎంట్రీ.. సినిమా కన్‌ఫార్మ్!
ప్రశాంత్ వర్మతో బాలయ్య సినిమా కన్‌ఫార్మ్. త్వరలోనే ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది. అయితే ఈ చిత్రం ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఉంటుందా? లేదా..
- gum 95921
- Published On : May 29, 2023 / 10:26 AM IST
Balakrishna movie with Hanuman fame Prashanth Varma confirmed
Balakrishna – Prashanth Varma : నందమూరి బాలకృష్ణ తన NBK108 మూవీ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అనిల్ రావిపూడి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత బోయపాటితో అఖండ సీక్వెల్ లో బాలయ్య నటించబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా బాలకృష్ణ మరో ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర న్యూస్ బయటకి వచ్చింది. కల్కి, జాంబీరెడ్డి (Zombie Reddy) సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మతో బాలయ్య ఒక సినిమా చేయబోతున్నాడట.
Balakrishna : తండ్రి ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ ఎమోషనల్ స్పీచ్
ఆల్రెడీ కథ విని ఒకే చేయడం కూడా అయ్యిపోయిదని ప్రశాంత్ వర్మ తెలియజేశాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు సూపర్ హీరో మూవీ హనుమాన్ (Hanuman) ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ తరువాత కూడా అలాంటి సూపర్ హీరో కథ ‘అధీర’తో రాబోతున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి అయిన తరువాత బాలయ్య సినిమా పట్టాలు ఎక్కే అవకాశం ఉన్నట్లు ప్రశాంత్ వర్మ తెలియజేశాడు. కాగా ఈ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని ఒక సూపర్ హీరో ప్రపంచాన్ని సృస్టిస్తునట్లు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.
Balakrishna : బాలయ్య – శివన్న సినిమాపై క్లారిటీ.. త్వరలోనే పాన్ ఇండియా మల్టీస్టారర్ ఫిలిం..
ఇప్పుడు బాలయ్యతో తీసే సినిమా కూడా అదే యూనివర్స్ లో ఉంటుందా? లేదా వేరే స్టోరీ లైన్ తో ఉంటుందా? అనేది తెలియాలి. ఇక ఈ వార్త తెలుసుకున్న బాలయ్య అభిమానులు.. ఈ కాంబినేషన్ లో సినిమా చూస్తామా అని ఆసక్తి చూపిస్తున్నారు. ఇక NBK108 విషయానికి వస్తే.. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీలీల (Sreeleela) ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తుంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
