Balakrishna : అల్లుడు గెస్ట్ గా 200 కోట్ల బాలయ్య సినిమా ఓపెనింగ్.. అమరావతిలో NBK112..
నేడు NBK 112 నిర్మాత చెరుకూరి సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ సినిమా ఓపెనింగ్ గురించి ప్రకటించారు. (Balakrishna)
- Saketh U
- Published on- June 24, 2026 / 08:02 PM IST
Balakrishna
Balakrishna : బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ కొరటాల శివతో సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. నేడు NBK 112 నిర్మాత చెరుకూరి సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ సినిమా ఓపెనింగ్ గురించి ప్రకటించారు.
Also Read : Mirzapur : సూపర్ హిట్ సిరీస్.. ఇప్పుడు సినిమా.. మిర్జాపూర్ వచ్చేస్తుంది..
చెరుకూరి సుధాకర్ మాట్లాడుతూ.. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 112వ సినిమా రేపు ఉదయం 8 గంటలకు అమరావతిలోని TTD ఆలయంలో ప్రారంభిస్తున్నాం. బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందుతోంది. అమరావతిలో ఈ సినిమా ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉంది. అమరావతిలో ఒక సినిమా ప్రారంభిద్దాం అని బాలకృష్ణ ఎప్పటి నుంచో చెబుతుండేవారు. ఇప్పుడు అది కార్యరూపం దాల్చుతోంది. బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కు, కొరటాల శివ స్టైల్ కి తగ్గట్టుగా ఈ చిత్రం ఉంటుంది. రేపటి కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ లు గెస్టులుగా హాజరవుతారు. ఆగస్టు నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. దాదాపు 150 కోట్ల నుంచి 200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నాం. 2027 సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తాం అని తెలిపారు.
అలాగే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ప్రతిభ ఉంది. ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించే దిశగా ఈ సినిమా కూడా ఒక వేదికగా ఉంటుంది. భవిష్యత్తులో రాష్ట్రంలో మరిన్ని స్టూడియోలు ఏర్పడే అవకాశం ఉంది. గత మూడు నాలుగేళ్లుగా బాలకృష్ణ గారితో సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అది సాధ్యమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రకాశం జిల్లాకు చెందినవాడిని. అమరావతిలో ఈ సినిమా ప్రారంభం కావడం వ్యక్తిగతంగా కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది అని అన్నారు.
