Balakrishna : NBK108 టైటిల్ అప్డేట్.. దర్శకుడు బాబీ అండ్ బోయపాటి మూవీ అప్డేట్స్ పై న్యూస్..
బాలకృష్ణ బర్త్ డేకి గిఫ్ట్స్ రెడీ అవుతున్నాయి. NBK108 టైటిల్ అడ్వాన్స్ గా వస్తుంటే.. దర్శకుడు బాబీ అండ్ బోయపాటి మూవీ అప్డేట్స్ జూన్ 10న అధికారికంగా రానున్నాయి.
- gum 95921
- Updated on- June 6, 2023 / 11:55 AM IST
Balakrishna NBK108 title update and Bobby Boyapati Srinu movie updates
Balakrishna NBK108 : నందమూరి బాలకృష్ణ అఖండ(Akhanda), వీరసింహారెడ్డి(Veera SimhaReddy) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకోవడమే కాకుండా 100 కోట్ల కలెక్షన్స్ ని కూడా అందుకొని ఫుల్ ఫార్మ్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ నటసింహం అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ నెల 10న బాలయ్య పుట్టినరోజు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. దీంతో బాలకృష్ణ నిర్మాతలు బర్త్ డేకి గిఫ్ట్ ని రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే NBK108 టైటిల్ అప్డేట్ ని ఇచ్చారు.
Ustaad Bhagat Singh : ఉస్తాద్ అప్డేట్ ఇచ్చిన పవన్ నిర్మాతలు.. కీలక షెడ్యూల్ కోసం భారీ సెట్..
బాలయ్య పుట్టినరోజుకి రెండు రోజులు ముందుగానే టైటిల్ ని అనౌన్స్ చేస్తామంటూ నిర్మాతలు తెలియజేశారు. బాలకృష్ణ మునపటి సినిమాలు లాగానే ఈ మూవీ టైటిల్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని వెల్లడించారు. అయితే సోషల్ మీడియాలో ఒక టైటిల్ కొన్నిరోజులు నుంచి వైరల్ అవుతుంది. ఈ మూవీకి ‘భగవత్ కేసరి’ అనే టైటిల్ ని అనుకుంటున్నట్టు సమాచారం. భగవత్ అంటే విష్ణువు, కేసరి అంటే హిందీలో సింహం అని అర్ధం. మరి ఇదే టైటిల్ ని ఫిక్స్ చేస్తారా? లేదా మరో టైటిల్ తో వస్తారా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
అలాగే ఈ బర్త్ డేకి బాలయ్య నటించబోయే కొత్త సినిమా అప్డేట్ లు కూడా రానున్నాయి. వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు బాబీతో బాలయ్య నెక్స్ట్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నాగవంశీ నిర్మించనున్నాడట. ఇక బోయపాటితో బాలయ్య సినిమా గీతా ఆర్ట్స్ లో ఉండబోతుందట. ఈ రెండు సినిమా అప్డేట్స్ ని జూన్ 10న అధికారికంగా ప్రకటించనున్నారు.
