Ustaad Bhagat Singh : ఉస్తాద్ అప్డేట్ ఇచ్చిన పవన్ నిర్మాతలు.. కీలక షెడ్యూల్ కోసం భారీ సెట్..

పవన్ భగత్ సింగ్ మూవీ నుంచి నిర్మాతలు ఉస్తాద్ అప్డేట్ ని ఇచ్చారు. ఈ సినిమాలోని ఒక కీలక సన్నివేశం కోసం ఓ భారీ సెట్‌ని..

Ustaad Bhagat Singh : ఉస్తాద్ అప్డేట్ ఇచ్చిన పవన్ నిర్మాతలు.. కీలక షెడ్యూల్ కోసం భారీ సెట్..

Pawan Kalyan Ustaad Bhagat Singh movie latest update is here

Updated On : June 5, 2023 / 7:17 PM IST

Pawan Kalyan Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ ఒక పక్క వారాహి యాత్ర అప్డేట్స్ ఇస్తూనే, మరో పక్క సినిమా అప్డేట్స్ కూడా ఇస్తూ అభిమానులను, జనసైనికులను ఖుషీ చేస్తున్నాడు. వారాహి యాత్ర అనౌన్స్ చేయగానే పవన్ సినిమాల విషయం ఏంటని అభిమానులు అంతా కంగారు పడ్డారు. అయితే ఇప్పుడు పవన్ సినిమాల నుంచి వరుస అప్డేట్స్ రావడం చూసి అభిమానులు కొంచెం రిలాక్స్ అవుతున్నారు. నిన్న (జూన్ 4) OG మూవీ మూడో షెడ్యూల్ ని స్టార్ట్ చేసిన పవన్.. కొన్నిరోజులు ఆ షూటింగ్ లో పాల్గొనున్నట్లు మేకర్స్ తెలియజేశారు.

Adipurush : ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహిస్తున్న హనుమాన్ టీం.. ప్రశాంత్ వర్మ డైరెక్షన్, తేజ సజ్జ యాంకరింగ్..

తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి నిర్మాతలు అప్డేట్ ఇచ్చారు. సినిమాలోని కీలక సన్నివేశం కోసం ఒక భారీ సెట్ ని నిర్మిస్తున్నారు. ఈ సెట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి దగ్గర ఉండి ఈ సెట్ పనులు చూసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో అండ్ ఫోటోలు షేర్ చేస్తూ మూవీ టీం అభిమానులకు తెలియజేసింది. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక OG షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత పవన్.. వారాహి యాత్రలో పాల్గొనున్నాడు. ఆ యాత్ర ముగిసిన తరువాత ఉస్తాద్ షూట్ జాయిన్ అవుతాడని తెలుస్తుంది.

Siddharth : సిద్దార్థ్ ట్విట్టర్ నుంచి వెళ్ళిపోడానికి కారణం తోటి హీరోలా..? క్లారిటీ ఇచ్చిన హీరో!

కాగా ఈ సినిమాని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు. గబ్బర్ సింగ్ తరువాత మళ్ళీ వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ లో ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల (Sreeleela) నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.