Balakrishna : హైదరాబాద్‌లో బాలయ్యకు ఆపరేషన్..? నెల రోజుల పాటు షూటింగ్ బంద్..
తాజా సమాచారం ప్రకారం ప్రాథమిక చికిత్స పూర్తిచేసిన అనంతరం బాలయ్యను హైదరాబాద్ కి తరలించారు. (Balakrishna)
- Saketh U
- Published on- July 22, 2026 / 03:26 PM IST
Balakrishna
Balakrishna : జులై 21న బాలకృష్ణ కాకినాడలో జరుగుతున్న సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. NBK111 సినిమా షూటింగ్ లో భాగంగా మంచు మనోజ్, బాలకృష్ణ మధ్య కీలక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బాలయ్య మోకాలికి గాయమైంది. వెంటనే అక్కడ లోకల్ హాస్పిటల్ కి తరలించగా వైద్యులు చిన్న సర్జరీ చేయాలని సూచించారు.
తాజా సమాచారం ప్రకారం ప్రాథమిక చికిత్స పూర్తిచేసిన అనంతరం బాలయ్యను హైదరాబాద్ కి తరలించారు. బాలకృష్ణ మోకాలి శస్త్రచికిత్సం కోసం హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్య నివేదికల ప్రకారం నేడు బాలకృష్ణ మోకాలికి సర్జరీ జరగనుంది. ఆపరేషన్ అనంతరం బాలకృష్ణ కోలుకునేందుకు కనీసం 4 నుంచి 5 వారాల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరమని చికిత్స అందిస్తున్న వైద్యులు చెప్పినట్టు తెలుస్తుంది.
Also Read : Nandamuri Deepika : రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వదినమ్మ..? టీడీపీ పోస్టర్స్‌తో వైరల్.. బయటకొచ్చిన నందమూరి దీపిక..
దీంతో అభిమానులు, పలువురు సెలబ్రిటీలు బాలయ్య త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. బాలయ్య ఆపరేషన్ తర్వాత కనీసం నెల రోజులు రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో NBK 111 సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో దసరాకు రావాల్సిన ఈ సినిమా వాయిదా పడనున్నట్టు తెలుస్తుంది. బాలయ్య నెల రోజుల్లో కోలుకొని వస్తే డిసెంబర్ లేదా, సంక్రాంతికి ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది.
