Periodical Movies : రొటీన్ సినిమాలకు బ్రేక్.. పీరియాడిక్ సినిమాలతో రెడీ అవుతున్న హీరోలు..
ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ పీరియాడిక్ మూవీస్ మీదే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. (Periodical Movies)
- Saketh U
- Published On : March 18, 2026 / 07:30 PM IST
Periodical Movies
Periodic Movies : హీరోలు వెనక్కి వెళ్తున్నారు. అప్ కమింగ్ సినిమాల కోసం టైమ్ మెషీన్ లో వెనక్కెళుతున్నారు. వరసపెట్టి పీరియాడిక్ మూవీస్ చేస్తున్నారు. స్టార్ హీరోల దగ్గరనుంచి యంగ్ హీరోల వరకూ అందరూ పీరియాడిక్ సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. కాంటెంపరరీ సినిమాలకి బ్రేక్ ఇచ్చి వరసగా పీరియాడిక్ మూవీస్ చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ పీరియాడిక్ మూవీస్ మీదే ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
ఈ లిస్ట్ లో ప్రభాస్ యాజ్ యూజువల్ గా టాప్ లోనే ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్నసినిమాలు సైఫైతో పాటు పీరియాడిక్ కూడా ఉన్నాయి. ప్రభాస్ – హనురాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫౌజి పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతోంది. 1940 లో జరిగిన ప్రీ ఇండిపెండెన్స్ వార్ డ్రామాగా ఫౌజి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ సైనికుడిగా కనిపించబోతున్నారు.
మరో స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా వరసగా పీరియాడిక్ మూవీస్ చేస్తున్నారు. ఇప్పటికే దేవరతో ఆడియన్స్ ని వెనక్కి తీసుకెళ్లిన ఎన్టీఆర్ దేవర 2 కోసం మరోసారి పీరియాడిక్ యాక్షన్ కి రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న డ్రాగన్ సినిమా కూడా పీరియాడిక్ యాక్షన్ మూవీగానే రాబోతోంది. 1960, 70ల్లో జరిగిన బంగ్లాదేశ్ , ఇండియా మైగ్రెంట్స్ స్టోరీగా డ్రాగన్ సినిమా తెరకెక్కుతోంది. ఈ పీరియాడిక్ సినిమాలో ఎన్టీఆర్ బాగా సన్నబడి కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు.
Also Read : Manchu Lakhsmi Daughter : మంచు లక్ష్మి కూతురు విద్యా నిర్వాణ ఓణీల వేడుక.. ఫొటోలు..
సీనియర్ హీరో బాలయ్య అప్పుడప్పుడు పీరియాడిక్, హిస్టారిక్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కెరీర్లో చాలా పీరియాడిక్ సినిమాలు చేసారు. గౌతమి పుత్రశాతకర్ణితో హిస్టారిక్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న బాలకృష్ణ ఇప్పుడు గోపీచంద్ తో చేస్తున్న సినిమాని కంప్లీట్ హిస్టరీ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. లార్జర్ ద్యాన్ లైఫ్ యాక్షన్ తో భారీ యాక్షన్, పీరియాడిక్ ఎలిమెంట్స్ తో సాలిడ్ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రాప్ కాబట్టి ప్రీ ప్రొడక్షన్ కే ఎక్కువ టైమ్ తీసుకున్నారు గోపీచంద్. ఇంత పకడ్బంధీగా ప్లాన్ చేసిన సినిమా నుంచి పవర్ ఫుల్ అప్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
స్టార్ హీరోలంటే ఏం చేసినా సరే ఆడియన్స్ లో ఫుల్ బజ్ ఉంటుంది. కానీ యంగ్ హీరోలు, పెద్దగా మార్కెట్ లేని హీరోలు అలా కాదు. వాళ్లకి మినిమం గ్యారంటీ ఉన్న సబ్జెక్ట్స్ చేస్తేనే అటూ ఇటవుతూ ఉంటాయి. అలాంటిది పవర్ ఫుల్ పీరియాడిక్ మూవీస్ చేస్తుంటే రిజల్ట్ ఎలా ఉంటుందో. ఇప్పుడు యంగ్ హీరోలు, మిడ్ రేంజ్ హీరోలు కూడా పీరియాడిక్ పైనే పడ్డారు.
గోపీచంద్.. ఏదో ఫ్లోలో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు కానీ ఇప్పటి వరకూ ఒకటి రెండు తప్ప పెద్దగా ప్రయోగాలు చేసింది లేదు. కానీ ఈసారి మాత్రం పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో ఫుల్ బిజీగా ఉన్నారు గోపీచంద్. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో గోపీచంద్ చేస్తున్న సినిమా 7వ శతాబ్ధానికి చెందిన బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన గోపీచంద్ లుక్, హీరోయిన్ గా రీతూవర్మ లుక్ సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. సాహసం, భీమ లాంటి సమ్ థింగ్ డిఫరెంట్ సినిమాలు చేసిన గోపీచంద్ ఈ పీరియాడిక్ డ్రామా ని ఆడియన్స్ ముందుకు ఎలా తీసుకొస్తారో చూడాలి.
Also Read : Harish Shankar : ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయి వచ్చి తనకు ప్రపోజ్ చేస్తే.. హరీష్ శంకర్ ఏం చెప్పాడో తెలుసా?
రౌడీ హీరోగా, కాంటెపరరీ సినిమాలతో యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు కంప్లీట్ గా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయారు. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్లో తెరకెక్కుతున్న రణబాలి సినిమాని పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. 19వ శతాబ్థంలో బ్రిటిష్ కాలంలో ఫ్రీడమ్ ఫైటర్ రోల్ లో విజయ్ దేవరకొండ కనిపించబోతున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పవర్ ఫుల్ వీడియో, బ్యూటిఫుల్ సాంగ్.. రణబాలి మీద అంచనాలు పెంచేసాయి. వీటికితోడు విజయ్ కెరీర్ లో ఫస్ట్ పీరియాడిక్ మూవీ కాబట్టి ఇంకాస్త హైప్ పెరిగిపోతోంది.
దుల్కర్ సల్మాన్.. సినిమాల విషయంలో ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. అలా పవన్ సాధినేని డైరెక్షన్లో దుల్కర్ హీరోగా తెరకెక్కుతున్న ఆకాశంలో ఒకతార పీరియాడిక్ మూవీ గానే తెరకెక్కుతోంది. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా ఆకాశంలో ఒకతార తెరకెక్కుతోంది. సాత్విక వీరవల్లి హీరోయిన్ గా చేస్తున్న ఆకాశంలో ఒకతార నుంచి వీడియో రిలీజై సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది.
హీరో నిఖిల్ అయితే వరసగా పీరియాడిక్ మూవీస్ చేస్తున్నాడు. అంతగా మార్కెట్ లేకపోయినా భారీ బడ్జెట్ తో నిఖిల్ తో పీరియాడిక్ మూవీస్ చేస్తున్నారు మేకర్స్. అలా నిఖిల్ ప్రస్తుతం స్వయంభు, ఇండియా హౌజ్ ఈ రెండు పీరియాడిక్ మూవీస్ చేస్తున్నారు. ఇవి రెండిట్లో అటు పీరియాడిక్, ఇటు హిస్టరీ ఈ రెండు జానర్స్ ని టచ్ చేసినట్టు తెలుస్తోంది. స్వయంభు ఏప్రిల్ 10న రిలీజ్ కి రెడీ అవుతుంటే ఇండియాహౌజ్ షూటింగ్ ప్రాసెస్ లో ఉంది.
Also See : Mrunal Thakur : అక్కతో కలిసి ఫేమస్ వినాయక ఆలయాన్ని దర్శించిన మృణాల్ ఠాకూర్.. ఫొటోలు..
మిరాయ్ తో మళ్లీ పికప్ అయిన మంచు మనోజ్ సినిమాల విషయలో స్పీడ్ పెంచాడు. రొటీన్ క్యారెక్టర్ కి పెద్దగా ఇంప్రెస్ అవ్వని ఆడియన్స్ కి సమ్ థింగ్ డిఫరెంట్ స్టోరీ చెప్పబోతున్నారు. డేవిడ్ రెడ్డి అనే పవర్ ఫుల్ పీరియాడిక్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు మనోజ్. ఈ సినిమా కోసం బాడీ పెంచి మేకోవర్ కూడా అవుతున్న మనోజ్ 1920ల్లో వచ్చిన బ్రిటిష్ కొలొనియల్ రూల్ బ్యాక్ డ్రాప్ లో డేవిడ్ రెడ్డి సినిమా తెరకెక్కుతోంది. ఇలా రొటీన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి పీరియాడిక్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు హీరోలు.
