Unstoppable episode 5 : సంక్రాంతికి చిరంజీవికి ఎన్ని థియేటర్లు ఇస్తున్నారు.. నాకు ఎన్ని ఇస్తున్నారు.. బాలయ్య!

అన్‌స్టాపబుల్ రెండో సీజన్ ఎపిసోడ్-5 ప్రోమోని విడుదల చేశారు షో నిర్వాహుకులు. ఈ ప్రోమోలో బాలకృష్ణ.. సంక్రాంతికి నాకు థియేటర్లు ఇచ్చే ప్రరిస్థితి ఉందా అంటూ అల్లు అరవింద్, సురేష్ బాబులను నిలదీసాడు.

తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌ ఆహా.. ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోతో రెండు తెలుగురాష్ట్రాలను ఒక ఊపు ఊపేస్తోంది. నిక్కర్చిగా మాట్లాడే బాలకృష్ణని ఈ షోకి వ్యాఖ్యాతగా పెట్టి.. చంద్రబాబు, మోహన్ బాబు, మహేష్ బాబు వంటి ఎంతోమంది సినీరాజకీయ నాయకుల జీవితాల్లో దాగున్న పలు కీలక విషయాలను అభిమానులకు తెలిసేలా చేస్తుండడంతో, అన్‌స్టాపబుల్‌ షో అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతుంది.

Unstoppable episode 5 : చిరు, బాలయ్యల మల్టీస్టారర్.. అన్‌స్టాపబుల్‌లో అల్లు అరవింద్ కామెంట్స్..

తాజాగా రెండో సీజన్ ఎపిసోడ్-5 ప్రోమోని విడుదల చేశారు నిర్వాహుకులు. ఈ ఎపిసోడ్ కి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, సురేష్ బాబులతో పాటు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కే రాఘవేంద్రరావు హాజరయ్యారు. కాగా ఈసారి సంక్రాంతికి బాలకృష్ణ – వీరసింహరెడ్డి, చిరు – వాల్తేరు వీరయ్య సినిమాలో వస్తున్న సంగతి తెలిసిందే. ఇక కొందరు నిర్మాతలు కొన్ని థియేటర్లను వారి అధీనంలో ఉంచుకోవడంతో, కొన్నిరోజులుగా థియేటర్ల కేటాయింపు గురించి టాలీవుడ్ లో చర్చలు జరుగుతున్నాయి.

దీంతో బాలకృష్ణ.. ఈ ఇద్దరి ప్రొడ్యూసర్ లను ఈ షోలో థియేటర్లు విషయం గురించి నిలదీసి అడిగాడు. “ఈసారి సంక్రాంతికి నాకు ఎన్ని థియేటర్లు ఇస్తున్నారు చెప్పండి” అంటూ అల్లు అరవింద్, సురేష్ బాబు లను అడిగాడు. మరి ఈ ప్రశ్నకు ఈ నిర్మాతలు ఏమి బదులిస్తారో తెలియాలంటే, ఎపిసోడ్ విడుదలయిన తరువాత చూసి తెలుసుకోవాలాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు