Balakrishna
తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌పై టాలీవుడ్ ఒక్కసారిగా భగ్గుమంది. చిన్న స్టార్ నుంచి పెద్ద హీరో వరకు అందరూ తీవ్రంగా ఖండించారు. అంతేకాదు తమ సోషల్ మీడియా వేదికగా కొండా సురేఖపై విమర్శలు చేస్తూ ట్వీట్లు, పోస్టులు పెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే అక్కినేని నాగార్జునకు తమ నైతిక మద్దతు ప్రకటించి తాము ఉన్నామని భరోసా ఇచ్చారు. అయితే ఒక స్టార్ హీరో మాత్రం అసలు స్పందించలేదు. ఇప్పుడా స్టార్ హీరో ఎందుకు రియాక్ట్ కాలేదన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
నాగార్జున కుటుంబం మీద కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై బాలకృష్ణ రియాక్ట్ కాలేదు. అయితే ఆయన పాత విషయాలను మరచిపోలేదా.. అందుకే స్పందించలేదన్న చర్చ జరుగుతోంది. అయితే అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా బాలకృష్ణ పెద్ద ప్రెస్ నోటే ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు బాలయ్య సైలెంట్‌గా ఉన్నారంటూ టాలీవుడ్‌లో చర్చ నడుస్తుంది.
బాలయ్య రియాక్ట్ కాకపోవడానికి రెండు కారణాలు ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఒకటి తన అక్క నారా భువనేశ్వరిపై వైసీపీ వాళ్ళు కామెంట్స్ చేస్తే నాగార్జున కనీసం స్పందించలేదని బాలకృష్ణ మనసులో పెట్టుకుని ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు నాగార్జున వైసీపీకి మద్దతుదారుడని, బాలయ్య టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం బిజీలో ఉండి మర్చిపోయి ఉంటారన్న వాదన వినిపిస్తున్నారు. కారణం ఏదైనా అందరి మద్దతు దొరికిన నాగార్జునకు..బాలయ్య మద్దతు లభించకపోవడం మాత్రం చర్చనీయాంశం అవుతోంది.
35 Chinna katha kaadu : ఆహాలో అదరగొడుతున్న నివేదా ’35 చిన్న కథ కాదు’ మూవీ..