Beauty Movie : పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలతో.. ఆడపిల్లల తండ్రి ఎమోషన్ తో ఈ సినిమా వస్తుంది..

నేడు బ్యూటీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.(Beauty Movie)

Beauty Movie : పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలతో.. ఆడపిల్లల తండ్రి ఎమోషన్ తో ఈ సినిమా వస్తుంది..

Beauty Movie

Updated On : September 14, 2025 / 9:35 PM IST

Beauty Movie : అంకిత్ కొయ్య, నీలఖి జంటగా తెరకెక్కుతున్న సినిమా బ్యూటీ. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ బ్యానర్స్ పై విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ ఈ సినిమాని నిర్మించారు. JSS వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 19న రిలీజ్ కాబోతుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.(Beauty Movie)

బ్యూటీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. మా ప్రతీ సినిమా ఆడిందంటే దానికి కారణం SKN. ఈరోజుల్లో సినిమాకు ఎస్ కే ఎన్, శ్రేయాస్ శ్రీనివాస్ సపోర్ట్ చేశారు. వాళ్లిద్దరూ లేకుంటే నేను లేను. సుబ్బు ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా ఆ ఫాదర్ ఫీలింగ్‌ను పేపర్ మీద పెట్టి ఈ కథ చెప్పారు. భలే ఉన్నాడే సినిమా పోయిందని సాయి వర్ధన్ బాధలో ఉన్నాడు అందుకే పిలిచి ఈ కథ ఇచ్చాను. మదర్ కారెక్టర్‌లో వాసుకి గారు జీవించారు. వాసుకి, నరేష్ గారు చేసిన పర్ఫామెన్స్ చూసి డిస్ట్రిబ్యూటర్‌లు ఎమోషనల్ అయ్యారు. బ్యూటీ గొప్ప సినిమా. ప్రతీ తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. సెప్టెంబర్ నెల బాగా కలిసి వస్తోంది. లిటిల్ హార్ట్స్ బాగా ఆడుతోంది. మిరాయ్ హిట్ అయింది. ఇప్పుడు బ్యూటీ వస్తోంది. ఓజీ ఎలా ఉండోబోతోందో నాకు తెలుసు. మధ్యలో ‘బ్యూటీ’ని చూడండి. ఆడపిల్లల గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలతో, యథార్ఘ సంఘటనలతో బ్యూటీ కథను రాశారు అని తెలిపారు.

Also Read : Pawan Kalyan : OG హుడీ వేసి మరీ డబ్బింగ్ చెప్పించారుగా.. పవర్ స్టార్ పవర్ ఫుల్ డబ్బింగ్ ఫినిష్..

Beauty Movie

నిర్మాత SKN మాట్లాడుతూ.. మామూలు టికెట్ రేట్లతో సినిమాలు వస్తే జనాలు థియేటర్లకు వస్తున్నారని సినీ పెద్దలు గుర్తించాలి. బ్యూటీ కథ నా మనసుకి హత్తుకుంది. పిల్లలు అడిగిందల్లా కొనివ్వలేని పేరెంట్స్ పడే మథనం గురించి అద్భుతంగా చూపించారు. సెప్టెంబర్ 19న బ్యూటీ రాబోతోంది. 18న పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నారు. అమీర్ పేట్‌ AAA లో నేను ఫ్రీ షో వేయిస్తాను. అమ్మాయిలు తన ఫ్యామిలీతో కలిసి వచ్చి ఆ షోని చూడొచ్చు అని అన్నారు. హీరో అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. వర్దన్ కి మారుతి గారు రెండో అవకాశం ఇచ్చారు. సక్సెస్ లేనప్పుడు కూడా మారుతి గారు వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తుంటారు. మారుతీనగర్ సుబ్రహ్మణ్యం థియేటర్‌ విజిట్‌కు వెళ్తే తిమ్మరుసు, ఆయ్ లో చేసింది నువ్వేనా? అని అడిగారు. మంచి చిత్రాలు చేస్తున్నావ్ అంటూ ఆ పెద్దాయన అన్న మాటలు నాలో స్పూర్తిని నింపాయి. ఒక్కసారి వచ్చి సినిమా చూడండి నచ్చకపోతే సున్నా రేటింగ్ ఇవ్వండి, నచ్చితే మాత్రం ప్రమోట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లండి అని అన్నారు.

Beauty Movie Pre Release Event Happened Director Maruthi Producer SKN Comments

డైరెక్టర్ JSS వర్దన్ మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రతీ ఒక్కరినీ సీటులో కూర్చోబెడుతుంది. నాకు రెండో ఛాన్స్ ఇచ్చిన మారుతి గారు నాకు డెమీ గాడ్. మా రైటర్స్, అంకిత్‌తో కలిసి ఓ ఐదు రోజులు పని చేసి పూర్తి స్క్రిప్ట్, కథను రెడీ చేశాను అని అన్నారు. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల మాట్లాడుతూ.. వందల కోట్లు సంపాదించాలని వానరా సెల్యూలాయిడ్‌ను ప్రారంభించలేదు. మంచి సినిమాలను నిర్మించాలని ఇండస్ట్రీలోకి వచ్చాను అని అన్నారు.

Also Read : Pawan Kalyan : పవర్ స్టార్ కి గ్రాండ్ ఫేర్‌వెల్ ఇచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. పవన్ చేతిని పట్టుకొని హరీష్ శంకర్..

బ్యూటీ

సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ.. తెలుగు సినీ చరిత్రలో దాసరి గారి టీం నుంచి ఎక్కువ మంది దర్శకులు ఇండస్ట్రీలోకి వచ్చారు. మళ్లీ ఇప్పుడు మారుతి గారి టీం నుంచి ఎక్కువ మంది దర్శకులు వస్తున్నారు. భలే భలే మగాడివోయ్ సినిమాకు మొదటి సారిగా మారుతితో పని చేశాను. ఆ తరువాత మళ్లీ నాకు కామెడీ సినిమాలు వచ్చాయి అని తెలిపారు. నటి వాసుకి మాట్లాడుతూ.. తొలిప్రేమ నుంచి ఇప్పటి వరకు నాకు నచ్చిన పాత్రలు, కథల్ని మాత్రమే ఎంచుకుంటూ వచ్చాను. ఈ బ్యూటీ కథ విన్న వెంటనే మా నాన్న, నా భర్త గుర్తుకు వచ్చారు. తల్లిదండ్రులతో కలిసి పిల్లలు చూడాల్సిన సినిమా ఇది. ఫ్యామిలిలో చిన్న చిన్న గొడవలు ఉంటే ఈ సినిమాని చూస్తే అవన్నీ సమసిపోతాయి అని అన్నారు.

హీరోయిన్ నీలఖి మాట్లాడుతూ.. మేం తెలుగు వాళ్లమే కానీ ఒడిస్సాలో సెటిల్ అయ్యాం. తెలుగు కల్చర్ నాకు కొత్తేమీ కాదు. నాకు బ్యూటీ మొదటి సినిమా అని తెలిపింది. కథ, స్క్రీన్ ప్లే రైటర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. నేను జర్నలిస్ట్‌గా పని చేసినప్పుడు టీనేజ్ అమ్మాయిలు ఇంట్లోంచి పారిపోయే కేసులు ఎక్కువగా చూశాను. అదే పాయింట్‌ను మారుతి గారికి చెప్పాను. దాన్ని ఇలా మలిచాం. మారుతి గారు ఇప్పటి వరకు దాదాపు 15,16 మంది డైరెక్టర్లు, రచయితలకు అవకాశం ఇచ్చారు అని తెలిపారు.