Chandrababu – Balakrishna : చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బాలకృష్ణ రియాక్షన్ ఇదే.. అన్‌స్టాపబుల్‌లో బాలకృష్ణ వ్యాఖ్యలు..
చంద్రబాబు.. నన్ను అరెస్ట్ చేసినప్పుడు మీరు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అని బాలకృష్ణను అడిగారు.
- Saketh U
- Published On : October 25, 2024 / 09:08 PM IST
Balakrishna speak about his first Reaction after Chandrababu Naidu Arrest in Unstoppable Show
Chandrababu – Balakrishna : ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా అన్‌స్టాపబుల్ సీజన్ 4 నేటి నుంచి మొదలైంది. మొదటి ఎపిసోడ్ కి సీఎం చంద్రబాబు రాగా రాజకీయాలు, పవన్ కళ్యాణ్, ఫ్యామిలీ గురించి.. ఇలా చాలా అంశాలు మాట్లాడారు. ఈ క్రమంలో చంద్రబాబు.. నన్ను అరెస్ట్ చేసినప్పుడు మీరు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అని బాలకృష్ణను అడిగారు.
బాలకృష్ణ సమాధానమిస్తూ.. నాకు కూడా మీరు అరెస్ట్ అయ్యారని ఫోన్ వచ్చింది. ఒక్క క్షణం షాక్ అయిపోయాను. అందరిలాగే ఏం జరుగుతుంది, ఎక్కడికి తీసుకెళ్తున్నారు తెలీదు, ఎవర్ని రానివ్వట్లేదు. మొత్తం లాక్ చేసేసారు. లోకేష్ బాబుకి, పార్టీ నాయకులకు కాల్ చేశాను. మిమ్మల్ని టచ్ చేస్తే జనాలు ఊరుకోరు. ఇది ఒక అమానుషం. మీ అరెస్ట్ ని తెలుగు వాళ్ళందర్నీ కదిలించింది అని తెలిపారు.
