×
Ad

Tatineni Ramarao : తాతినేని రామారావు మృతి పట్ల సంతాపం తెలిపిన బాలకృష్ణ

దర్శకుడు అనే మాటకు వన్నె తెచ్చిన దర్శకులు తాతినేని రామారావు గారు. ఆయన ఈరోజు మనమధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. తాతినేని రామారావు గారి మరణ వార్త నన్నెంతగానో కలచివేసింది.

  • Published On : April 20, 2022 / 02:24 PM IST

Balakrishna

 

Tatineni Ramarao :  ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు తీసి విజయవంతమైన దర్శకుడు తాతినేని రామారావు. మంగళవారం అర్ధరాత్రి ఆయన కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ పరిశ్రమ ప్రముఖులు సంతాపం తెలియచేస్తూ, నివాళులు అర్పిస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ దర్శకులు తాతినేని రామారావు మృతి పట్ల సంతాపం తెలుపుతూ అయన గురించి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

 

Star Heroes Movies: కేజీఎఫ్ టెర్రర్.. అంతకుమించిన అంచనాలతో కొత్త సినిమాలు!

”దర్శకుడు అనే మాటకు వన్నె తెచ్చిన దర్శకులు తాతినేని రామారావు గారు. ఆయన ఈరోజు మనమధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. తాతినేని రామారావు గారి మరణ వార్త నన్నెంతగానో కలచివేసింది. తాతినేని రామారావు గారు అద్భుతమైన దర్శకులు. నాన్నగారితో చరిత్రలో నిలిచిపోయే ‘యమగోల’ లాంటి విజయవంతమైన చిత్రాలు తీసి మేటి దర్శకులుగా నిలిచారు. ఆయన దర్శకత్వంలో నేను కథానాయకుడిగా చేసిన ‘తల్లితండ్రులు’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి అభిమాన చిత్రంగా నిలిచింది. నిర్మాత పక్షాన నిలబడి, నిర్మాతకు ఒక రూపాయి మిగలాలని ఆలోచిస్తూ, అదే సమయంలో సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడకుండా చిత్రాలు నిర్మించే ప్రతిభ తాతినేని రామారావు గారి సొంతం. బాలీవుడ్ లోనూ హిట్ చిత్రాలు తీసి అక్కడా విజయవంతమైన దర్శకుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. తాతినేని రామారావు గారి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ ఆయనకి సంతాపం తెలుపుతూ నివాళులు అర్పించారు.