బాలయ్య 50వ సినిమా : 29 ఏళ్ళ నారీ నారీ నడుమ మురారి

1990 ఏప్రిల్ 27న విడుదలైన నారీ నారీ నడుమ మురారి, 2019 ఏప్రిల్ 27నాటికి విజయవంతంగా 29 సంవత్సరాలు పూర్తి చేసుకుంది..

  • Published By: sekhar ,Published On : April 27, 2019 / 02:45 PM IST
బాలయ్య 50వ సినిమా : 29 ఏళ్ళ నారీ నారీ నడుమ మురారి

Updated On : April 27, 2019 / 2:45 PM IST

1990 ఏప్రిల్ 27న విడుదలైన నారీ నారీ నడుమ మురారి, 2019 ఏప్రిల్ 27నాటికి విజయవంతంగా 29 సంవత్సరాలు పూర్తి చేసుకుంది..

యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 50వ చిత్రం.. ‘నారీ నారీ నడుమ మురారి’.. అప్పటికే తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న బాలయ్య, కెరీర్ మైల్ స్టోన్ అయిన తన 50వ సినిమాకి, పక్కా కమర్షియల్ సబ్జెక్ట్ ఎంచుకుంటాడు అనుకుంటే, మాస్ మసాలా సాంగ్స్, డిష్యూం డిష్యూం ఫైట్స్ లేని, ‘నారీ నారీ నడుమ మురారి’ లాంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని సెలెక్ట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. యువచిత్ర బ్యానర్‌పై, కె.నరసింహ నాయుడు నిర్మాతగా, స్టార్ డైరెక్టర్ ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో, శోభన, నిరోషా హీరోయిన్స్‌గా, కైకాల సత్యనారాయణ, శారద ప్రధాన పాత్రల్లో నటించిన నారీ నారీ నడుమ మురారి, 1990 ఏప్రిల్ 27న విడుదలై, 2019 ఏప్రిల్ 27నాటికి విజయవంతంగా 29 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

కమర్షియల్ ఎలిమెంట్స్‌ని పక్కనపెట్టి, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ హైలెట్‌గా తెరకెక్కిన నారీ నారీ నడుమ మురారి చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. బాలయ్య నటన సినిమాకి హైలెట్ అయ్యింది. ఇందులో ఒక కొత్త బాలకృష్ణని చూసారు ఫ్యాన్స్, ఆడియన్స్. కె.వి.మహదేవన్ స్వరపరిచిన పాటలు ఎవర్ గ్రీన్.. తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గానూ, బాలయ్య కెరీర్‌లో 50వ సినిమాగా, ఆయన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలింగా నారీ నారీ నడుమ మురారి నిలిచిపోతుంది. అల్లు రామలింగయ్య, బాబూ మోహన్, అంజలీదేవి, రమాప్రభ తదితరులు నటించిన ఈ సినిమాకి కెమెరా : అజయ్ విన్సెంట్, ఎడిటింగ్ : గౌతంరాజు, రచన : తనికెళ్ళ భరణి, భమిడిపాటి రాధ, కృష్ణ, జి.సత్యమూర్తి, డైలాగ్స్ : వినాయక శర్మ.

వాచ్, ‘ఇరువురు భామల కౌగిలిలో’ సాంగ్..