Chapri : ‘ఛప్రి’ వచ్చేస్తున్నాడు. మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తో బండి సరోజ్ కుమార్..
డిఫరెంట్ కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే బండి సరోజ్ ఇపుడు మరో కొత్త కథతో రాబోతున్నాడు. (Chapri)
- Saketh U
- Published on- November 6, 2026 / 08:42 PM IST
Chapri
Chapri : మాంగళ్యం, పరాక్రమం, నిర్భంధం.. లాంటి డిఫరెంట్ సినిమాలతో హీరోగా, దర్శకుడిగా పబ్లిక్ స్టార్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు బండి సరోజ్ కుమార్. ఆయన నటన, మేకింగ్, టేకింగ్ ఓ వర్గానికి చెందిన ప్రేక్షకులని ఇంప్రెస్ చేస్తుంది. ఎప్పటికప్పుడు డిఫరెంట్ కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే బండి సరోజ్ ఇపుడు మరో కొత్త కథతో రాబోతున్నాడు.
కొన్ని నెలల క్రితమే సరోజ్ హీరోగా ఛప్రి అనే సినిమాని ప్రకటించాడు. ఈ సినిమాకు హీరోగానే కాక స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, దర్శకత్వం, నిర్మాత.. ఇలా అన్ని బాధ్యతల్ని చూసుకుంటున్నాడు సరోజ్. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ పై సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీన్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్.. పలువురు కీలక పాత్రలను పోషించారు.
Also Read : Pavan Kalyan Padala : బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా కొత్త సినిమా..
నేడు ఛప్రి సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు స్లమ్‌లో ఉండే ఓ కుర్రాడు.. అతడి ప్రేమ ప్రయాణం.. ఆ జర్నీలో కొంత మంది డబ్బున్న వ్యక్తులు ఎదురు పడటం, వాళ్ళ వల్ల అతని జీవితం తలకిందులు అవ్వడం అనే ఆసక్తికరమైన పాయింట్స్‌తో ఛప్రి సినిమా తెరకెక్కుతుంది. ఛప్రి ఫస్ట్ లుక్‌లో సరోజ్ కొత్తగా కనిపిస్తున్నాడు. స్లమ్ కుర్రాడిలా రా అండ్ రస్టిక్‌గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ని గమనిస్తుంటే ఫుల్ యాక్షన్ సినిమా అనిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమా గురించి మిగిలిన వివరాలు ప్రకటించనున్నారు. ఛప్రి ఫస్ట్ లుక్ రావడంతో బండి సరోజ్ ఫ్యాన్స్ ఈ పోస్టర్ ని వైరల్ చేస్తూ సినిమా రిలీజ్ కోసం అప్డేట్ అడుగుతున్నారు.
