Parakramam Song : బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’ సినిమా నుంచి.. బ్యూటిఫుల్ లవ్ సాంగ్ విన్నారా?

ఇప్పటికే పరాక్రమం సినిమా నుంచి టీజర్, పోస్టర్స్, ఓ సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా మరో క్యూట్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు.

Bandi Saroj Kumar Parakramam Movie Cute Love Song Released

Parakramam Song : నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం.. ఇలాంటి బోల్డ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ ఇప్పుడు ‘పరాక్రమం’ సినిమాతో రాబోతున్నాడు. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ పై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ తనే దర్శకత్వం చేస్తూ సొంతంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

Also Read : Rocking Rakesh – Sujatha : తల్లి తండ్రులు కాబోతున్న జబర్దస్త్ జంట..

ఇప్పటికే పరాక్రమం సినిమా నుంచి టీజర్, పోస్టర్స్, ఓ సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా మరో క్యూట్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు. పరాక్రమం డ్రీమ్ సాంగ్ అనే పేరుతో ఈ పాటని విడుదల చేశారు. ‘వచ్చాడులే పరాక్రమం..నా కన్నె మనసు చేరే కొత్త సంగమం..’ అనే రొమాంటిక్ లిరిక్స్ ని సరోజ్ కుమార్ రాసి తనే ఈ పాటకు సంగీతం అందించాడు. ఈ పాటను వైష్ణవి గోపరాజు పాడింది. ఈ పాటను మీరు కూడా వినేయండి..

ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయిన పరాక్రమం సినిమా ఆగస్టు 22న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

ట్రెండింగ్ వార్తలు