Parakramam : ‘పరాక్రమం’ ట్రైలర్ రిలీజ్.. వంద మందిని మట్టి కురిపించే సత్తా పరాక్రమం..

తాజాగా 'పరాక్రమం' ట్రైలర్ రిలీజ్ చేశారు.

Parakramam Trailer : నటుడు, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ ఇప్పుడు పరాక్రమం సినిమాతో రాబోతున్నాడు. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ పై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తూ నిర్మించిన సినిమా పరాక్రమం. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. పరాక్రమం సినిమా ఆగస్టు 22న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ లోనే సరోజ్ కుమార్ మరోసారి అదరగొట్టేసాడు. నాటకాలు, ఓ ప్రేమ, ఓ పగ, క్రికెట్ చుట్టూ కథ ఆసక్తిగా తిరుగుతుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. అలాగే సరోజ్ కుమార్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. దీంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. పరాక్రమం సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించగా హీరో సందీప్ కిషన్, నిర్మాత SKN అతిథులుగా వచ్చారు. మీరు కూడా పరాక్రమం ట్రైలర్ చూసేయండి..

ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ట్రైలర్ లాంఛ్ కు వచ్చిన నా మిత్రుడు నిర్మాత SKN, హీరో సందీప్ కిషన్ కు థ్యాంక్స్. ఈ సినిమా ప్రతి కామన్ మ్యాన్ కు కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో సత్తిబాబు, లోవరాజు రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి. అందరిలో ఈ రెండు పాత్రలు ఉంటాయి. సత్తిబాబు నుంచి లోవరాజుకు జరిగే ట్రాన్సఫర్మేషన్ ఈ సినిమా. కామన్ మ్యాన్ లా బతకడం ఈ రోజుల్లో కష్టం. మీ లైఫ్ లో హీరోలు, విలన్స్, ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. సినిమా చూస్తే మిమ్మల్ని మీరు చేసుకున్నట్టు ఉంటుంది. నా ఫేవరేట్ హీరో చిరంజీవి పుట్టినరోజున పరాక్రమం సినిమా రిలిజ్ చేయడం సంతోషంగా ఉంది అని అన్నారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. బండి సరోజ్ కుమార్ చాలా జెన్యూన్ ఫిలింమేకర్. ఆయన వ్యక్తిత్వం, సినిమాలు, సినిమా ఈవెంట్లు కూడా కొత్తగా ఉంటాయి. నేను చెన్నైలో ఉన్నప్పుడు పోర్కాలం సినిమా ఆ డైరెక్టర్ ఎవరా అని ఆశ్చర్యపోయాను. అప్పుడే ఫేస్ బుక్ లో వెతికి మరీ మాట్లాడాను. ఆయన సినిమాలు యూట్యూబ్ లో చూసి నేను కూడా డబ్బులు పంపించాను. పరాక్రమం ఒక జెన్యూన్ ఫిల్మ్. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

నిర్మాత SKN మాట్లాడుతూ.. బండి సరోజ్ కుమార్ టాలెంటెడ్ ఫిలింమేకర్. ఆయన సినిమాలు చూసి నేను కూడా డబ్బులు పంపించాను. మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్ డే ఆగస్టు 22న సినిమా రిలీజ్ అవ్వడం సంతోషంగా అంది. ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ ఉన్నా ఫ్యూచర్ లో నేను బండి సరోజ్ కుమార్ సినిమాకు ప్రొడ్యూస్ చేస్తాను అని తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు