Bandla Ganesh : ఆ స్వామిజి బయోపిక్ నేనే తీస్తా : బండ్ల గణేష్
బండ్ల గణేశ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా పవన్ కళ్యాణ్ సినిమాలకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించడంతో బాగా పాపులర్ అయ్యాడు. కమెడియన్ గా, నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి స్థానం
- Saketh U
- Published On : October 25, 2021 / 06:59 PM IST
Bandla Ganesh
Bandla Ganesh : బండ్ల గణేశ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా పవన్ కళ్యాణ్ సినిమాలకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించడంతో బాగా పాపులర్ అయ్యాడు. కమెడియన్ గా, నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి స్థానం సంపాదించాడు. ఇక పవన్ కళ్యాణ్ తన దేవుడు అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో బండ్లన్న మాట్లాడే స్పీచ్ లతో బాగా వైరల్ అయ్యాడు. దీంతో బండ్ల గణేష్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. మధ్యలో రాజకీయాలు అంటూ తిరిగి హడావిడి చేసి ఆ రకంగా కూడా కొన్ని రోజులు ట్రెండ్ లో ఉన్నాడు. సినిమాలు చేయను అని చెప్తూనే సినిమాలు చేస్తున్నాడు బండ్ల గణేష్. ప్రస్తుతం బండ్ల గణేశ్ హీరోగా ఓ డిఫరెంట్ స్టోరీతో ఓటిటి కోసం ‘డేగల బాబ్జి’ అనే సినిమా చేయబోతున్నాడు. ఇటీవల ‘మా’ ఎలక్షన్స్ లో కూడా రోజుకొకరికి సపోర్ట్ ఇచ్చి, ఒకసారి పోటీ చేస్తా అని మరో సారి విరమించుకుంటున్నా అని.. ఇలా కొద్ది రోజులు వార్తల్లో నిలిచాడు. తాజాగా మరో సారి వార్తల్లో బండ్ల గణేష్ పేరు వినిపిస్తుంది.
Varudu Kavalenu : ఊళ్ళో పెళ్ళిళ్ళని సినిమా ప్రమోషన్ల కోసం వాడిన నాగశౌర్య
ఇటీవల ఆధ్యాత్మిక గురువు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని బండ్ల గణేశ్ సందర్శించారు. ఆయనను దర్శించుకున్న విషయాన్ని, ఆయనతో దిగిన ఫోటోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతే కాక ఆ ఫోటో తో పాటు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా తెలిపారు. సచ్చిదానంద స్వామి జీవితంపై ఒక సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. అప్పాజీ జీవిత చరిత్ర నేనే చేసి తీరుతా… అయన పాదాల సాక్షిగా నాకు అనుమతించారు…ఎవరి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు… అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే అది నిర్మాతగానా? ఆర్టిస్టుగానా? అని చెప్పలేదు. బండ్ల మరో కొత్త ప్రాజెక్ట్ అది కూడా స్వామిజి బయోపిక్ అనడంతో అంతా దీని గురించి మాట్లాడుకుంటున్నారు.
అప్పాజీ జీవిత చరిత్ర నేనే చేసి తీరుతా… అయన పాదాల సాక్షిగా నాకు అనుమతించారు…ఎవరి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు..? pic.twitter.com/JqqY06pvTt
— BANDLA GANESH. (@ganeshbandla) October 24, 2021
