Bandla Ganesh : గబ్బర్ సింగ్ షూటింగ్ లో ప్రమాదం.. పవన్ పై బండ్ల గణేష్ ఎమోషనల్ పోస్ట్

న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ (Bandla Ganesh) సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఎమోష‌న్ పోస్టును షేర్ చేశాడు.

Bandla Ganesh Emotional post on Pawan kalyan gabbar singh shooting incident

Bandla Ganesh : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజాల‌కు వెంట‌నే శ‌స్త్ర‌చికిత్స చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్ప‌త్రి వైద్యులు సూచించారు. సోమ‌వారం త‌న భార్య అన్నా లెజినోవాతో క‌లిసి ప‌వ‌న్ ముంబైకి వెళ్లి ఆస్ప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. రొటేట‌ర్ క‌ఫ్ తో పాటు భుజానికి సంబంధించిన రెండు కండ‌రాల్లో గాయం తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

కొంత‌కాలంగా ప‌వ‌న్ ఈ గాయాల‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిసిందే. ఈ గాయాలు ఇప్ప‌టివి కావ‌ని గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో త‌గిలినవి. దీనిపై ఆ చిత్ర నిర్మాత, న‌టుడు బండ్ల గ‌ణేష్ స్పందించారు. నిన్న రాత్రంతా త‌న‌కు నిద్ర రాలేద‌ని చెప్పుకొచ్చారు. నాటి విష‌యాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు.

Vishal-Anjali : బోలెండ ప్రేమ‌తో అంటూ విశాల్‌తో ఉన్న ఫోటోల‌ను షేర్ చేసిన అంజ‌లి..

‘నిన్న రాత్రంతా నిద్ర రాలేదు.. ఒకటే ఆలోచన.. ఒక సంవత్సరం కాదు.. రెండు సంవత్సరాలు కాదు.. దాదాపు పదిహేనేళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మనిషి విలవిల్లాడిపోతాడు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణం.

నాకు ఈ రోజు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్లముందే కనిపిస్తున్నాయి. గుజరాత్‌లో జరిగిన ఆ ప్రమాదం.. గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం.. వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం.. ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు.. మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం. ముందు సినిమా పూర్తి చేద్దాం.. నిర్మాతకు ఇబ్బంది కలగకూడదు.. ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు..అని ‘ బండ్ల గ‌ణేష్ ఎమోష‌న్ అయ్యారు.

Kevvu Kartheek : కెవ్వు కార్తీక్ కూతురు.. 21st day celebrations.. ఫోటోలు..