Bandla Ganesh: పవన్ కళ్యాణ్‌తో లాస్ట్ సినిమా.. ఆ తర్వాత బ్యానర్ క్లోజ్.. బండ్ల గణేష్ షాకింగ్ డెసిషన్
పవన్ కళ్యాణ్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న బండ్ల గణేష్(Bandla Ganesh).
- V Santhosh Kumar
- Updated on- May 26, 2026 / 09:26 AM IST
Bandla Ganesh making another movie with Pawan Kalyan
- ఈవెంట్‌లో పవన్, బండ్ల కలయిక.
- పవన్‌తో త్వరలో భారీ సినిమా.
- ఆ తర్వాత బ్యానర్ మూసేస్తా.
Bandla Ganesh: ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ప్రారంభోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సుదీర్ఘ కాలం తర్వాత ఒకే వేదికపై కలిశారు. పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్‌కు ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్‌లో వీరిద్దరూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ కలయిక అనంతరం బండ్ల గణేష్ ఎమోషనల్ అవుతూ నెట్టింట పెట్టిన పోస్ట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
Chiranjeevi: ఫిల్మ్ చాంబర్ నిర్ణయమే ఫైనల్.. అందరికీ న్యాయం జరుగుతుంది: మెగాస్టార్ చిరంజీవి
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్(Bandla Ganesh) పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను సృష్టించి, భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత మళ్లీ తన దేవుడైన పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడమే తన జీవిత ఆశయమని బండ్ల గణేష్ ఈ ఇంటర్వ్యూలో మరోసారి స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో ఆయన ఒక సంచలన ప్రకటన కూడా చేశారు. త్వరలోనే పవన్ కళ్యాణ్‌తో తన పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్‌లో మరో భారీ చిత్రాన్ని నిర్మిస్తానని, ఆ సినిమా పూర్తయిన తర్వాత తన నిర్మాణ సంస్థను శాశ్వతంగా మూసేస్తానని (క్లోజ్ చేస్తానని) ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సినిమాతోనే తన కెరీర్‌లో అత్యున్నత విజయాన్ని అందుకున్నానని, మళ్లీ ఆయన సినిమాతోనే నిర్మాతగా తన ప్రయాణానికి ఘనమైన ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు బండ్ల గణేష్ ఎమోషనల్‌గా వివరించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
