Bandla Ganesh : ఒక్క సినిమా ఇవ్వు బాబు… బ్లాక్బస్టర్ తీస్తా.. ఆ హీరోని రిక్వెస్ట్ చేసిన బండ్లన్న.. ఛాన్స్ ఇస్తాడా మరి?
ఇటీవల కొన్ని రోజుల క్రితం మళ్ళీ సినిమాలు చేస్తాను నిర్మాతగా అని ప్రకటించాడు బండ్ల గణేష్. (Bandla Ganesh)
Bandla Ganesh
Bandla Ganesh : ఇప్పుడంటే స్టేజీలపై స్పీచ్ లు, ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు బండ్ల గణేష్. కానీ ఒకప్పుడు మంచి నటుడితో పాటు స్టార్ నిర్మాత కూడా. తీన్ మార్, గబ్బర్ సింగ్, బాద్షా, ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరి వాడేలే, టెంపర్.. లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసాడు. కానీ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు.
ఇటీవల కొన్ని రోజుల క్రితం మళ్ళీ సినిమాలు చేస్తాను నిర్మాతగా అని ప్రకటించాడు బండ్ల గణేష్. తాజాగా బండ్లన్న హీరో నాగచైతన్య ని కలవగా ఆయనతో.. ఒక్క సినిమా ఇవ్వు బాబు బ్లాక్బస్టర్ తీస్తా అని రిక్వెస్ట్ చేసుకున్నాడు. దీనికి చైతూ సమాధానమిస్తూ.. నేను ఎప్పుడో ఓకే చెప్పాను. డైరెక్టర్ కూడా మీరు ఎవరు చెప్తే వాళ్ళే అని అన్నారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
మరి నిజంగానే నాగచైతన్య బండ్ల గణేష్ కు ఛాన్స్ ఇస్తాడా? మళ్ళీ ఇదివరకు లా బ్లాక్ బస్టర్ సినిమాలు బండ్ల గణేష్ తీస్తాడా తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.
