Pawan kalyan : ఇకపై పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేయను.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు..

తాజాగా పవన్ కళ్యాణ్ తో ఇకపై సినిమాలు చేయను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేష్. ఇటీవల యిచ్చిన ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడుతూ మా బాస్ పవన్ కళ్యాణ్ తో........

 

Bandla Ganesh :  బండ్లగణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. పవన్ కళ్యాణ్ కి వీర భక్తుడు అనే సంగతి మన అందరికి తెలిసిందే. కుదిరితే పవన్ కళ్యాణ్ ని పొగడటమే పనిగా పెట్టుకుంటాడు. ఇప్పటికే పవన్ తో నిర్మాతగా సినిమాలు తీసిన బండ్ల గణేష్ మళ్ళీ ఛాన్స్ వస్తే మా బాస్ తో సినిమాలు తీస్తాను అంటాడు. పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా చేస్తా అంటాడు బండ్ల. పవన్ కళ్యాణ్ స్పీచ్ లతోనే బండ్ల గణేష్ ఎక్కువగా ఫేమస్ అయ్యాడని కూడా అందరికి తెలిసిందే.

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తో ఇకపై సినిమాలు చేయను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేష్. ఇటీవల యిచ్చిన ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడుతూ మా బాస్ పవన్ కళ్యాణ్ తో నేను మళ్ళీ సినిమా చేయదలుచుకోవట్లేదు అని అన్నారు. అదేంటి మీరు పవన్ కళ్యాణ్ తో మళ్ళీ సినిమా చేస్తా అన్నారు కదా ఎందుకు ఇప్పుడు వద్దు అనుకుంటున్నారు అని కారణం అడగగా బండ్లగణేష్ ఆశ్చర్యపోయే సమాధానం చెప్పాడు.

Vishwak Sen : అనుకోకుండా అన్నాను అంటూ.. సారీ చెప్పిన విశ్వక్ సేన్..

బండ్ల గణేష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న సినిమాలే తొందరగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఈ సమయంలో నాకు సినిమా ఇస్తారని అనుకోవట్లేదు. అయినా ఆయన త్వరగా సీఎం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. వచ్చే ఎలెక్షన్స్ లో ఆయన సీఎం అవ్వాలి. సీఎం అయితే ఎలాగో సినిమాలకి దూరంగా ఉంటారు. అందుకే నేను ఆయనతో సినిమా చేయకూడదు అనుకుంటున్నాను. ఆయనని సీఎంగానే చూడాలి అనుకుంటున్నాను అని తెలిపారు.

Upasana : 150 వృద్ధాశ్రమాలకు అండగా నిలవనున్న ఉపాసన

మరి మీకు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ కానీ లేదా ఏదయినా పదవి ఇస్తే తీసుకుంటారా అని అడగగా.. బండ్లగణేష్ దీనికి సమాధానంగా నాకు ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, ఎంపీలు వద్దు సార్‌. జనం దయతో వార్డు మెంబర్‌గా గెలిచినా ఆ కిక్కే వేరు అని అన్నారు. ప్రస్తుతం నేను రాజకీయాలకి దూరంగా ఉన్నాను. భవిష్యత్తులో ఏం అవుతుందో తెలీదు అని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు