Bandla Ganesh : జూనియర్ బండ్ల గణేష్ భలే ఉన్నాడుగా..
ఫొటోలో ఉన్న కుర్రాడు గ్లాసెస్ పెట్టుకుని అచ్చం బండ్ల గణేష్‌లానే ఉన్నాడు..
- sekhar
- Published On : August 3, 2021 / 06:49 PM IST
Bandla Ganesh Son
Bandla Ganesh: యాక్టర్, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మరోసారి మంచి మనసు చాటుకున్నారు. ఓ నెటిజన్.. తన తల్లి బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతుందని, డాక్టర్స్ ట్రీట్‌మెంట్‌కి ఇరవై లక్షల రూపాయలు ఖర్చువుతుందని, సాయం చెయ్యాల్సిందిగా బండ్లకు ట్వీట్ చెయ్యగా ఆయన సాయమందించారు. దీంతో గణేష్ చేసిన గొప్ప పనికి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Bandla Ganesh : అమ్మకు అండగా.. బండ్ల గణేష్ మంచి మనసుకు అభినందనల వెల్లువ..
ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో బండ్ల గణేష్ డూప్ ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. గణేష్, హీరోగా చేశాడా ఫైట్ సీన్స్‌లో అతనికి డూప్‌ని పెట్టడానికి అనుకుంటున్నారా..! అదేం కాదు. ఫొటోలో ఉన్న కుర్రాడు గ్లాసెస్ పెట్టుకుని అచ్చం బండ్లలానే ఉన్నాడు. అతను తన కొడుకంటూ ఇంట్రడ్యూస్ చేశాడు బండ్ల గణేష్.
PSPK : వావ్.. బండ్ల భలే టైటిల్ ఫిక్స్ చేశాడుగా..!
‘ఇతను నా పెద్ద కొడుకు హితేష్ నాగన్ బండ్ల’.. అంటూ కుర్రాడి పిక్ షేర్ చేశారు బండ్ల గణేష్. ‘అచ్చు మీ జిరాక్స్‌లా ఉన్నాడు. డిట్టో దిగిపోయాడు. హీరోని చేస్తారా..?’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తారా’ అనే ప్రశ్నకి ‘అంతా దేవుడి దయ’ అంటూ రిప్లై ఇచ్చారు బండ్ల గణేష్.
సినిమాల విషయానికొస్తే.. లాంగ్ గ్యాప్ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ తో నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చారు బండ్ల గణేష్. ప్రస్తుతం తన దైవం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘తీన్ మార్’, ‘గబ్బర్ సింగ్’ తర్వాత నిర్మాతగా మూడో సినిమా చెయ్యబోతున్నాడు. ఈ క్రేజీ మూవీకి సాలిడ్ కథ కోసం రైటర్స్‌తో పాటు, బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ కోసం వేటలో ఉన్నారు బండ్ల గణేష్.
My elder son Hitesh Nagan bandla ?? pic.twitter.com/RV3CvznC4F
— BANDLA GANESH. (@ganeshbandla) August 2, 2021
