Bandla Ganesh : అమ్మకు అండగా.. బండ్ల గణేష్ మంచి మనసుకు అభినందనల వెల్లువ..

నటుడు, నిర్మాత, బిజినెస్ మెన్‌.. బండ్ల గణేష్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు..

Bandla Ganesh : అమ్మకు అండగా.. బండ్ల గణేష్ మంచి మనసుకు అభినందనల వెల్లువ..

Bandla Ganesh

Updated On : August 2, 2021 / 2:36 PM IST

Bandla Ganesh: నటుడు, నిర్మాత, బిజినెస్ మెన్‌.. బండ్ల గణేష్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఆయన చేసిన గొప్ప పనికి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. బండ్ల గణేష్ అంటే పొలిటికల్ కామెడీ స్పీచ్‌లు అవీ అనుకున్నాం కానీ ఆయన మనసు చాలా మంచిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

PSPK : వావ్.. బండ్ల భలే టైటిల్ ఫిక్స్ చేశాడుగా..!

బండ్ల గణేష్ సోషల్ మీడియాను తన సినిమా అప్‌డేట్స్ కోసం, టైం పాస్ కోసం కాకుండా సోషల్ సర్వీస్ చెయ్యడానికి వాడుతుంటారు. తన సహాయం కోరిన వారికి, బయటకి చెప్పుకోకుండానే చాలా సార్లు సాయమందించారు.

ఇటీవల ఓ నెటిజన్.. తన తల్లి బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతుందని, డాక్టర్స్ ట్రీట్‌మెంట్‌కి ఇరవై లక్షల రూపాయలు ఖర్చువుతుందని, సాయం చెయ్యాల్సిందిగా బండ్ల గణేష్‌కు ట్వీట్ చేశాడు. ‘మీ గూగుల్ పే నెంబర్ ఇవ్వండి.. మనం ఆ దేవుడు ఆశీస్సులతో మీ అమ్మగారిని కాపాడడానికి ప్రయత్నిద్దాం’ అంటూ బండ్ల గణేష్ స్పందించారు. ఆయన మంచి మనసుని నెటిజన్లు అభినందిస్తున్నారు.