Bandla Ganesh: బండ్లకి ఇష్టమైన తెలుగు జాతి రత్నాలు వీళ్లేనట.. ట్వీట్ వైరల్!
నటుడు, స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీకి వీరాభిమానిగానే కాకుండా పవన్ కళ్యాణ్ కు వీర భక్తుడికి తనను..
- Naresh Mannam
- Published On : December 10, 2021 / 04:36 PM IST
Bandla Ganesh
Bandla Ganesh: నటుడు, స్టార్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా ఫ్యామిలీకి వీరాభిమానిగానే కాకుండా పవన్ కళ్యాణ్ కు వీర భక్తుడికి తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్న బండ్ల గణేష్ సందర్భాన్ని బట్టి ఆ విషయాన్ని మరింత గర్వంగా కూడా చెప్పుకుంటాడు. ఎక్కడ ఎలా ఛాన్స్ వచ్చిన మెగా కీర్తన చేసే బండ్ల గణేష్ ఇక పవన్ కళ్యాణ్ ను పొగుడుతుంటే ఆ పవన్ కళ్యాణ్ కూడా విరగబడి నవ్వేస్తుంటాడు.
KGF: అదే థీమ్.. అదే కాన్సెప్ట్.. తెలుగు తెరపై కేజీఎఫ్ ముద్ర!
కాగా.. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ను పొగిడే బండ్ల గణేష్ తాజాగా నాకు ఇష్టమైన తెలుగు ఆణిముత్యాలు వీళ్ళే అంటూ చేసిన రెండు ట్వీట్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మారాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. మీడియా సంస్థల అధినేత రామోజీరావు, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణలతో పాటు మెగాస్టార్ చిరంజీవితో నలుగురిని ఒకే ఫోటోలో కలిపి పోస్ట్ చేసిన బండ్ల గణేష్ నాకు తెలిసిన నాకిష్టమైన తెలుగు జాతి రత్నాలు వీళ్ళే అంటూ ట్వీట్ చేశాడు.
Project K: పాన్ వరల్డ్ ఫిల్మ్.. సెట్‌లో అడుగుపెట్టిన ప్రభాస్!
మరో ఫోటోలో ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్, చంద్రబాబుల ఫోటోలతో కూడా నాకు తెలిసిన నాకిష్టమైన జాతి రత్నాలు వీళ్ళే అంటూ మరోపోస్ట్ చేశాడు. బండ్ల ఎన్నడూ లేనిది ఇలా ఎనిమిది మందిని ఫోటోలతో సహా ట్వీట్ చేయడం ఒక విశేషం కాగా.. అందులో చిరంజీవి ఉండగా పవన్ కళ్యాణ్ లేకపోవడంతో మరో ఆసక్తికర అంశంగా మారింది. దీన్నే ఓ నెటిజన్, పవన్ అభిమాని మరి మన దేవుడు ఎక్కడ అని ప్రశ్నించగా బండ్ల గుండెల్లో అని మరో ట్వీట్ చేశాడు. మొత్తం ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారగా అసలు దీనివెనుక ఉద్దేశ్యం ఏంటో ఆ బండ్లకే తెలియాలి.
https://twitter.com/ganeshbandla/status/1469200457444720640
https://twitter.com/ganeshbandla/status/1469200152434921476
గుండెల్లో లో ❤️❤️❤️❤️❤️🙏 https://t.co/XlIQUJKBUV
— BANDLA GANESH. (@ganeshbandla) December 10, 2021
