KGF: అదే థీమ్.. అదే కాన్సెప్ట్.. తెలుగు తెరపై కేజీఎఫ్ ముద్ర!

ఈమధ్య చాలా సినిమాలు వస్తున్నా.. అల్టిమేట్ అన్నింటి థీమ్ ఒక్కటే ఉంటోంది. అన్ని రివేంజ్ డ్రామాల్లో ఒకటే ఇష్యూ ఉంటోంది. వీటన్నింటికీ రీజన్ఏంటా అని రీసెర్చ్ చేసిన సోకాల్డ్ టాలీవుడ్..

KGF: అదే థీమ్.. అదే కాన్సెప్ట్.. తెలుగు తెరపై కేజీఎఫ్ ముద్ర!

Kgf

KGF: ఈమధ్య చాలా సినిమాలు వస్తున్నా.. అల్టిమేట్ అన్నింటి థీమ్ ఒక్కటే ఉంటోంది. అన్ని రివేంజ్ డ్రామాల్లో ఒకటే ఇష్యూ ఉంటోంది. వీటన్నింటికీ రీజన్ఏంటా అని రీసెర్చ్ చేసిన సోకాల్డ్ టాలీవుడ్ జనాలు.. ఈ ఇష్యూ అంతటికీ కేజీఎఫ్ కారణమంటోంది. అటు అఖండ దగ్గరనుంచి ఇటు పుష్ప వరకూ మన సినిమాలపై కేజీఎఫ్ ఎఫెక్ట్ గట్టిగానే పడుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప ట్రైలర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఆడియన్స్ కి తెగనచ్చేసింది. అడవులు, అరుదైన చెట్లసంపద, దాన్ని అందుకోడానికి అందరూ చేసే ప్రయత్నాలు, అదంతా కుదరదు అంతా నాకే కావాలని ఫైట్ చేసే ఓ హీరో.. ఇదే థీమ్.

Project K: పాన్ వరల్డ్ ఫిల్మ్.. సెట్‌లో అడుగుపెట్టిన ప్రభాస్!

ఇదంతా ఎక్కడో విన్నట్టు చూసినట్టు ఉంది కదా. కరెక్టే.. ఇదంతా కన్నడ సినిమాగా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా రేంజ్ హిట్ తెచ్చుకున్న కేజీఎఫ్ సినిమా. కేజీఎఫ్ సినిమాలో బంగారు నిధి. ఆ బంగారం నాదంటే నాదంటూ పోటీపడి కొట్టుకునే విలన్ గ్యాంగ్. ఎంత మంది విలన్లున్నా.. ఎలా అడ్డంపడినా.. ఆనిధి మాత్రం సొంతం చేసుకుంటానని పంతం పట్టిన హీరో. ఆ నిధిని సొంతం చేసుకోవడానికి పడే సక్సెస్ ఫుల్ స్ట్రగుల్ డ్రామాగా సినిమా. ఈ కాన్సెప్ట్ తో తెరకెక్కి సూపర్ సక్సెస్ అయ్యింది కేజీఎఫ్. అటు ఇటూ తిప్పి ఇదే కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తున్నారు మేకర్స్.

Akhanda-KGF 2: టెక్నో వార్.. కేజీఎఫ్-2 వర్సెస్ అఖండ..!

పుష్ప సినిమానేకాదు అఖండ సినిమా చూస్తే కూడా ఎక్కడో కేజీఎఫ్ తాలూకు ఛాయలు కనిపిస్తున్నాయి. అఖండలో విలన్ ఎటైర్ ను చూస్తే సేమ్ కేజీఎఫ్ లో అధీరా డ్రెస్సింగ్ కనిపిస్తుంది. అంతేకాదు.. ఆ దుమ్ము, ఆ మాస్ అప్పియరెన్స్.. ఆ క్రూయల్ విలనిజం అంతా కేజీఎఫ్ లా గ్రాండ్ గా భారీ స్కేల్ కనిపిస్తుంది. అంతేకాదు.. వందల కొద్దీ విలన్లు.. గ్రాండ్ యాక్షన్ సీన్స్ ఎక్కడో తెలీకుండానే కేజీఎఫ్ ప్రభావం మనసినిమాల మీద కనిపిస్తోంది. భారీగా పాన్ ఇండియా వైడ్ గా, పెద్ద రేంజ్ లో ఆడియన్స్ కి రీచ్ అవుదామనుకుంటున్న సినిమాల మీద కేజీఎఫ్ గట్టిగానే ఇంపాక్ట్ చూపిస్తోందేమో అనిపిస్తుంది.