Vijay : ‘బీస్ట్’కి దెబ్బ మీద దెబ్బ.. మరో దేశంలో కూడా బ్యాన్..

ఇటీవల కువైట్ దేశం ఈ సినిమాని బ్యాన్ చేసింది. తాజాగా 'బీస్ట్' సినిమాని ఇదే కారణాలతో మరో దేశం కూడా బ్యాన్ చేసింది. కువైట్ కి దగ్గర్లోనే ఉండే........

Beast

 

Beast :  తమిళ్ స్టార్ విజయ్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్ గా యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బీస్ట్’. ఈ సినిమాని ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ బాగా వైరల్ అయ్యాయి. ట్రైలర్ కూడా అందర్నీ మెప్పించింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ తో బిజీ బిజీగా ఉన్నారు.

అయితే బీస్ట్ సినిమాకి వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే బీస్ట్ కి పోటీగా దేశమంతా ఎదురు చూస్తున్న ‘కెజిఎఫ్ 2’ సినిమా వస్తుంది. తమిళనాడులో బీస్ట్ ని కొట్టలేకపోయినా మిగతా దేశమంతా కచ్చితంగా బీస్ట్ ని ‘కెజిఎఫ్ 2’ డామినేట్ చేస్తుందని అందరి అభిప్రాయం. ఈ సినిమా యూనిట్ కి కూడా అలాగే అనిపించిందేమో ఎప్పుడూ ప్రమోషన్స్ కి రాని విజయ్ కూడా ఈ సారి రంగంలోకి దిగి సినిమాని వీర లెవెల్ లో ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాని ఓ దేశంలో బ్యాన్ చేశారు.

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ బేబీ బంప్ ఫొటోషూట్

మన ఇండియన్ సినిమాలని వేరే దేశాల్లో కూడా రిలీజ్ చేస్తారన్న సంగతి తెలిసిందే. బీస్ట్ సినిమాలో పాక్ టెర్రరిస్టులతో పాటు ఇస్లామిక్ టెర్రరిజం వంటి అంశాలు ఉండటం వల్ల ఇటీవల కువైట్ దేశం ఈ సినిమాని బ్యాన్ చేసింది. కువైట్ లో సెన్సార్ బోర్డు చాలా కఠినంగా ఉంటుంది. అక్కడ టెర్రరిస్ట్ లాంటి అంశాలని, నెగిటివ్ అంశాలని సినిమాల్లో చూపిస్తే ఒప్పుకోరు. అలాంటి సినిమాలని అక్కడ ప్రదర్శించరు. గతంలో కూడా చాలా ఇండియన్ సినిమాలు అక్కడ బ్యాన్ అయ్యాయి. ఇటీవల విష్ణు విశాల్ హీరోగా వచ్చిన ‘FIR’ సినిమా కూడా టెర్రరిస్టు నేపథ్యంలోనే ఉండటంతో ఆ సినిమాని కూడా బ్యాన్ చేశారు. కువైట్ సమాచార మంత్రిత్వ శాఖ బీస్ట్‌ సినిమాని నిషేధించింది. ఈ నిర్ణయంతో చిత్ర యూనిట్ తో పాటు విజయ్ అభిమానులు కూడా నిరాశ చెందుతున్నారు.

Srvanthi Chokarapu : మిత్రా శర్మ నాకు 5 లక్షలు ఇస్తానంది

తాజాగా ‘బీస్ట్’ సినిమాని ఇదే కారణాలతో మరో దేశం కూడా బ్యాన్ చేసింది. కువైట్ కి దగ్గర్లోనే ఉండే ఖతార్ దేశం కూడా బీస్ట్ సినిమాలో ఇస్లామిక్ టెర్రరిజం వంటి అంశాలు ఉండటం వల్ల సినిమాని తమ దేశంలో బ్యాన్ చేశారు. దీంతో బీస్ట్ సినిమాకి మరో దెబ్బ పడింది. మరి రేపు థియేటర్లలో రిలీజ్ అయి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులని మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమా డైరెక్టర్ వరుస హిట్స్ తో డిఫరెంట్ కథలతో మెప్పిస్తుండటంతో విజయ్ అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమా డైరెక్టర్ పైనే నమ్మకం పెట్టుకున్నారు.