Bellamkonda Sai Sreenivas
Bellamkonda Sai Sreenivas : హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే భైరవం, కిష్కింధపురి సినిమాలతో హిట్స్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు. ఈ సీజన్ లో టాలీవుడ్ సెలబ్రిటీలు అంతా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ లిస్ట్ లో శ్రీనివాస్ కూడా చేరాడు.
మార్చ్ 8 నేడు ఉదయం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డి అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నారు. కావ్య తండ్రి లాయర్. వీళ్ళ ఫ్యామిలిలో చాలా మంది లాయర్లు ఉన్నారని సమాచారం. హైదరాబాద్ అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.
Also Read : RJ Surya : పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ సూర్య.. పెళ్లి ఫోటోలు వైరల్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?
నేడు నిశ్చితార్థానికి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. పెళ్లి ఏప్రిల్ లో ఉంటుందని తెలుస్తుంది. త్వరలోనే పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించనున్నారు. గతంలో భైరవం సినిమా సమయంలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు శ్రీనివాస్.