Bellamkonda Srinivas- Kavya reddy: ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్- కావ్య ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్

టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్- కావ్య రెడ్డి(Bellamkonda Srinivas- Kavya reddy)ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

Bellamkonda Srinivas and Kavya Reddy engagement was celebrated grandly.

Bellamkonda Srinivas- Kavya reddy: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన కావ్య రెడ్డితో ఆయన నిశ్చితార్థం నగరంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో కాబోయే వధూవరులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోగా, దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడైన శ్రీనివాస్, ‘అల్లుడు శ్రీను’ చిత్రంతో వెండితెరకు పరిచయమై, గతేడాది ‘కిష్కింధపురి’తో హిట్ అందుకున్నాడు.

Vignesh Shivan: ధనుష్ లో మా నాన్నను చూసుకున్నా.. ఇప్పుడు సిగ్గుపడుతున్నా.. కూర్చొని మాట్లాడుకోవాల్సింది

కాబోయే వధూమణి కావ్య రెడ్డి(Bellamkonda Srinivas- Kavya reddy) కుటుంబ నేపథ్యం విషయానికొస్తే.. ఆమె తాతగారు రిటైర్డ్ జడ్జి కాగా, తండ్రి ప్రముఖ లాయర్‌గా రాణిస్తున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అయినప్పటికీ, వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా పరిచయం ఉందని తెలుస్తోంది. మార్చి నెలలోనే తన కాబోయే భార్యను అభిమానులకు పరిచయం చేసిన శ్రీనివాస్, ఇప్పుడు నిశ్చితార్థంతో పెళ్లి పీటల వైపు అడుగులు వేశారు. ఈ నెల 29వ తేదీన తిరుమల పుణ్యక్షేత్రంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరగనుంది. కొత్త జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.