Vignesh Shivan: ధనుష్ లో మా నాన్నను చూసుకున్నా.. ఇప్పుడు సిగ్గుపడుతున్నా.. కూర్చొని మాట్లాడుకోవాల్సింది
హీరో ధనుష్ తో విభేదాలపై ఎమోషనల్ కామెంట్స్ చేసిన దర్శకుడు విగ్నేష్ శివన్(Vignesh Shivan).
Director vignesh shivan emotional comments about dhanush
- డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ కామెంట్స్
- ధనుష్‌తో విడిపోవడంపై పశ్చాత్తాపం
- ధనుష్ లేకపోతే నేను లేను అంటూ క్లారిటీ
Vignesh Shivan: తమిళ స్టార్ ధనుష్, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఒకప్పుడు ఫ్రెండ్స్ లా ఉండేవారు. కానీ, కొన్ని కారణాల వల్ల వారి మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు ఆ దూరం చర్చనీయాంశంగా మారింది. నయనతార వివాహ డాక్యుమెంటరీ విడుదల సమయంలో తలెత్తిన వివాదాల వల్ల వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ధనుష్ నిర్మించిన ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రంలోని కొన్ని సెకన్ల ఫుటేజీని అనుమతి లేకుండా వాడారంటూ ధనుష్ టీమ్ రూ. 10 కోట్ల పరిహారం కోరడం, దానికి నయనతార బహిరంగ లేఖ రాయడం సంచలనం సృష్టించాయి. ఆ సమయంలో విఘ్నేశ్ కూడా ధనుష్‌పై సోషల్ మీడియాలో విమర్శలు చేశాడు.
Priyanka Jain: నా తల్లే నా మొదటి ప్రేమ.. ఎమోషనల్ ఫోటోలను షేర్ చేసిన ప్రియాంక జైన్
అయితే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విఘ్నేశ్ శివన్(Vignesh Shivan) తన పాత స్నేహితుడు ధనుష్‌పై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఎమోషనల్ చేశారు. ధనుష్‌తో స్నేహం చెడిపోవడం తన జీవితంలోనే చేదు జ్ఞాపకమని ఆయన ఆవేదన చెందారు. కెరీర్ ఆరంభంలో ధనుష్ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని, ‘రఘువరన్ బీటెక్’ సమయంలో రెండేళ్ల పాటు ఆయనతోనే ఉంటూ ఎంతో నేర్చుకున్నానని, తన తండ్రి మరణించిన రోజే ధనుష్ పుట్టినరోజు కావడంతో, ఆయనలో తన తండ్రిని చూసుకునేవాడినని, అంతటి గాఢమైన అనుబంధం బ్రేక్ అవడం తనను ఇప్పటికీ బాధపెడుతోందని విఘ్నేశ్ అన్నారు.
జరిగిన పొరపాట్లకు తాను సిగ్గుపడుతున్నానని, ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్యలు ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడుకుంటే బాగుండేదని విఘ్నేశ్ అభిప్రాయపడ్డారు. కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఇంత దూరం పెరిగిందని, అసలు ఆ గొడవ ఎందుకు జరిగిందో కూడా అర్థం కావడం లేదని అన్నారు. ధనుష్ లేకపోతే తాను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని కృతజ్ఞత చాటుకుంటూనే, కోల్పోయిన స్నేహాన్ని తిరిగి పొందలేకపోవడంపై తన మనసులోని బాధను బయటపెట్టారు. దీంతో విగ్నేష్ శివన్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
