BMB First Look: నివేత థామస్ తమ్ముడు హీరోగా ‘BMB’.. ‘బెంగళూరు మహానగరంలో బాలక’ ఫస్ట్ లుక్ రిలీజ్

'బెంగళూరు మహానగరంలో బాలక' మూవీ ఫస్ట్ లుక్(BMB First Look) విడుదల చేసిన మేకర్స్.

Bengaluru mahanagaramlo balaka movie first look released

  • ‘బెంగళూరు మహానగరంలో బాలక’ చిత్రం.
  • పోస్టర్ లాంచ్ చేసిన ప్రియదర్షి.
  • నివేదా థామస్ తమ్ముడి ఎంట్రీ.

BMB First Look: మంత్ర మూవీ మేకర్స్, ఫాల్కన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా మహి – రాజ్ ద్వయం దర్శకత్వంలో నిర్మిస్తున్న తాజా చిత్రం ‘బెంగళూరు మహానగరంలో బాలక(BMB First Look)’. ఆంధ్ర కుర్రాడు బెంగళూరు మహానగరంలో ఎదుర్కొనే కష్టాలు, సవాళ్ల నేపథ్యంలో ఒక అవుట్ అండ్ అవుట్ వినోదభరితమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల వరంగల్, హనుమకొండ పరిసర ప్రాంతాలలో ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు ప్రియదర్షి లాంచ్ చేశారు.

Epic: ఎపిక్ నుంచి ‘ప్రియసఖి’ సాంగ్.. హేషామ్ మ్యూజికల్ మ్యాజిక్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ మెలోడీ

ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ టాలీవుడ్‌కు నటుడిగా పరిచయమవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు మల్లూ నాయక్ సినిమాటోగ్రాఫర్‌గా విజువల్స్ అందిస్తుండగా, విశ్వదీప్ అద్భుతమైన సంగీతాన్ని సమకూరుస్తున్నారు. హర్షిత్ కొటా ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సరికొత్త కథాంశంతో, పక్కా ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.