Bhagavanth Kesari
Bhagavanth Kesari : నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna) అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి(Bhagavanth Kesari). కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) కథానాయిక కాగా శ్రీలీల(Sreeleela) కీలక పాత్రలో నటిస్తోంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది లు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్‌ను పోషిస్తుండగా దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇటీవలే టీజర్‌ను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. బాలకృష్ణ లుక్, డైలాగ్ డెలివరీ చాలా కొత్తగా ఉందంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. సినిమా రీలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. ఈ చిత్రం నందమూరి హరికృష్ణ నటించిన స్వామి సినిమానికి రీమేక్ అని ఆ వార్త సారాంశం.
Akshay Kumar : ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం అందుకున్న అక్షయ్.. మరి ఇన్నాళ్లు ఏ దేశపౌరుడిగా..?
2004లో వచ్చి స్వామి సినిమాకి భగవంత్ కేసరి అనధికార రీమేక్ నిజమేనా అంటూ ఓ నెటీజన్ ట్వీట్ చేయగా దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. అందులో ఎటువంటి నిజం లేదని చెప్పుకొచ్చింది. అసలు నిజం ఏమిటనేది అక్టోబర్ 19న తెలుస్తుందని తెలిపింది. ఇంతక ముందు ఎన్నడూ చూడని బాలయ్యను ఈ సారి వెండితెర పై చూస్తారంటూ రాసుకొచ్చింది. సో మొత్తానికి స్వామి చిత్రానికి భగవంత్ కేసరి రీమేక్ కాదని తేల్చి చెప్పింది.
బాలయ్య అంటే యాక్షన్, అనిల్ రావిపూడి అంటే కామెడీ. ఇక వీరిద్దరి కాంబినేషన్ అనగానే ఓ రకమైన ఆసక్తి ఏర్పడింది. అందుకు తగ్గట్లే టీజర్ ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి నేలకొండ భగవంత్ కేసరిగా బాలయ్య ఎలా నటించారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
Hyper Aadi : ప్రియురాలిని పరిచయం చేసిన హైపర్ ఆది.. ఆమెతోనే నిజమైన ప్రేమ..
Not true 🙂
The Real Truth is that, Oct 19th will be MASSIVE ❤️🔥❤️🔥
&
Everyone will celebrate NBK LIKE NEVER BEFORE on Big Screens😎🔥#BhagavanthKesari https://t.co/pm4uyHf1Rb— Shine Screens (@Shine_Screens) August 14, 2023