Bhagyashri Borse: ప్లాప్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. ముచ్చటగా మూడోసారి అదే బ్యానర్ లో
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మూడు సినిమా చేస్తున్న భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse).
- V Santhosh Kumar
- Published On : February 19, 2026 / 08:13 PM IST
Bhagyashri Borse doing her third movie in sithara entertainments
Bhagyashri Borse: మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. కానీ, ఈ సినిమా అమ్మడుకు ఆశించిన స్థాయి విజయాన్ని అందించలేదు. ఆ తరువాత విజయ్ విజయ్ దేవరకొండతో కింగ్డమ్ సినిమా చేసింది. ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ పడుతుంది అని నమ్మింది ఈ అమ్మడు. బ్యాడ్ లక్.. ఈ సినిమా కూడా ఆమెకు ఆశించిన స్థాయి విజయాన్ని ఆడించలేకపోయింది.
ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకొని రామ్ పోతినేనితో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా చేసింది. ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. అయినా కూడా ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్ కి రాలేదు. అలా వరుసగా మూడు ప్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse).
Punarnavi Bhupalam: పెళ్లికూతురిగా పునర్నవి.. లగ్నపత్రిక ఫోటోలు వైరల్
అయినప్పటికీ క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది ఈ అమ్మడు. ప్రస్తుతం భాగ్యశ్రీ అఖిల్ అక్కినేనితో లెనిన్ సినిమా చేస్తోంది. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సెన్స్ పై ఉండగానే మరో బంపర్ ఆఫర్ దక్కించుకుంది ఈ అమ్మడు. అది కూడా ఒకే బ్యానర్ లో మూడోసారి. ఆ బ్యానర్ మరేదో కాదు సితార ఎంటర్టైన్మెంట్స్. నిర్మాత నాగ వంశీ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా కొత్త సినిమాను ఇటీవలే స్టార్ట్ చేశాడు.
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ దర్శకుడు స్వరూప్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే సెలెక్ట్ చేశారు మేకర్స్. దీనికి సంబందించిన చర్చలు కూడా ఇప్పటికే ముగిశాయాని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది అని టాక్ నడుస్తోంది. ఇలా ఒకే బ్యానర్ నుంచి వరుసగా మూడు సినిమాల్లో నటించింది భాగ్యశ్రీ బోర్సే. మరి ఈ సినిమా అయినా ఆమెకు విజయాన్ని అందిస్తుంది అనేది చూడాలి.
