Punarnavi Bhupalam: పెళ్లికూతురిగా పునర్నవి.. లగ్నపత్రిక ఫోటోలు వైరల్
బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాళం(Punarnavi Bhupalam) పెళ్లి లగ్నపత్రిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Bigg Boss fame Punarnavi Bhoopalam to get married
Punarnavi Bhupalam: బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాళం త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఆమె తాను పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి ఫోటోలను రివీల్ చేసింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట తమ ప్రేమ గురించి పెద్ద వాళ్లకు చెప్పగా వాళ్ళు కూడా ఈ ఇద్దరు పెళ్ళికి పచ్చ జెండా ఊపారు. దీంతో, ఈ ఇద్దరు ఇప్పుడు పెళ్ళికి రెడీ అయ్యారు.
Kushitha Kallapu: పింక్ చీరలో పరువాల విందు.. కుషిత హాట్ ఫొటోలు వైరల్
ఇటీవలే గ్రాండ్ గా వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. దానికి సంబందించిన ఫోటోలను కూడా పునర్నవి(Punarnavi Bhupalam) సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు పెళ్ళికి కూడా వేలైనట్టుగా తెలుస్తోంది. తాజాగా వీరి పెళ్లికి సంబందించిన లగ్న పత్రికను సోషల్ మీడియాలో షేర్ చేసింది పునర్నవి. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో నీలిరంగు చీరాలో పెళ్లి కూతురిలా మెరిసిపోతోంది పునర్నవి. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
