Bharathiraja Son: ఏడాది క్రితం గుండెపోటుతో కొడుకు మరణం.. ఆ బాధతోనే భారతీరాజా..

Bharathiraja Son Manoj: ఏడాది క్రితం 2025 మార్చ్ లో తన కొడుకు మనోజ్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు.

  • Updated on- June 10, 2026 / 10:51 AM IST

Bharathiraja Passed Away Due to Grief of Son Manoj

Bharathiraja : నేడు ఉదయం స్టార్ డైరెక్టర్ భారతీ రాజా మరణించారు. గ‌త కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలు, వృద్ధాప్యంతో బాధ‌డుతున్న ఆయ‌న చికిత్స పొందుతూ 84 ఏళ్ళ వయసులో తుది శ్వాస విడిచారు. అయితే ఆయన గత సంవత్సర కాలంగా బాధలో ఉన్నారు.

ఏడాది క్రితం 2025 మార్చ్ లో తన కొడుకు మనోజ్ (Manoj Bharathiraja) అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. నటుడిగా, దర్శకుడిగా మనోజ్ కూడా తండ్రి బాటలోనే తమిళ సినీ పరిశ్రమలో ఎదుగుతున్నాడు. కానీ 48 ఏళ్ళ వయసులో గుండెపోటుతో మరణించాడు. కొడుకు మరణం భారతీరాజాని తీవ్రంగా కృంగదీసింది.

Also Read – Bharathi Raja : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా క‌న్నుమూత‌..

అప్పట్నుంచి ఆయన ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. నిరాశలో ఉన్నారు. సినిమాలకు కూడా దూరమయ్యారు. హాస్పిటల్ పాలయ్యారు. అప్పటివరకు వయసు పైబడినా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన భారతీరాజా కొడుకు మరణంతో సినిమాలు కూడా ఆపేసారు. కొడుకు లేడని ఏడాది నుంచి బాధపడుతూ ఆ బాధతోనే నేడు ఆయన కన్నుమూశారు. తెలుగు, తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి స్టార్ దర్శకుడిగా ఎదిగిన భారతీరాజాకు తెలుగు, తమిళ్ సినీ సెలబ్రిటీలు నివాళులు అర్పిస్తున్నారు.