×
Ad

BMW OTT: ఓటీటీకి వచ్చేసిన రవితేజ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీలో(BMW OTT)కి వచ్చేసింది.

bhartha mahasayulaku wignyapthi movie ott update

BMW OTT; మాస్ మహారాజ్ రవితేజ తన పంథా మార్చుకొని చేసిన సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి(BMW OTT). ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో డింపుల్ హయతి, అషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటించారు. నేను శైలజ ఫేమ్ దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు మిక్సుడ్ టాక్ వచ్చింది. చాలా మంది ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. రవి తేజ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విషయంలో సంతృప్తి కాలేదు.

Prabhas: మా సినిమా ఆగిపోలేదు.. సరైన సమయం కోసం చూస్తున్నాం

అయితే, థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఫిబ్రవరి 20 నుంచి భర్త మహాశయులకు విజ్ఞప్తి స్ట్రీమింగ్ వచ్చేసింది ఈ సినిమా. దీంతో, రవి తేజ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఓటీటీలో మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. కారణం ఏంటంటే, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాను థియేటర్స్ లో ఎక్కువ మంది చూడలేదు. అందుకే, ఓటీటీలో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది.