Bhavana Lasya : కాస్టింగ్ మేనేజర్ కాల్ చేసి బిజినెస్ మెన్ని కలుస్తావా అని.. కమిట్మెంట్ పై సీరియల్ నటి కామెంట్స్ వైరల్..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కమిట్మెంట్ గురించి ప్రశ్న ఎదురైంది. (Bhavana Lasya)
- Saketh U
- Published on- November 2, 2026 / 04:18 PM IST
Bhavana Lasya
Bhavana Lasya : అప్పుడప్పుడు సినీ పరిశ్రమలో కమిట్మెంట్ అనే మాట వినిపిస్తుంది. పలువురు నటీమణులు దీనిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగమ్మాయి, సీరియల్ నటి భావన లాస్య చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
మల్లి, లక్ష్మి నివాసం సీరియల్స్ తో సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగమ్మాయి భావన లాస్య. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సీరియల్స్ చేస్తుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కమిట్మెంట్ గురించి ప్రశ్న ఎదురైంది.
Also Read : Jabardasth Varsha : సీరియల్స్ ఎందుకు మానేసిందో చెప్పిన జబర్దస్త్ వర్ష.. పాపం..
దీనిపై స్పందిస్తూ.. సీరియల్స్ లో కమిట్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. చాలా కంట్రోల్డ్ గా ఉంటుంది ఇక్కడ సిస్టం. నాతో అలా మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. ఒకసారి కాస్టింగ్ మేనేజర్ కాల్ చేసి మాకు బిజినెస్ మెన్ తెలిసిన వాళ్ళు ఉన్నారు మీరు మీట్ అవుతారా అని అడిగారు. వాళ్ళు మొహమాటంగానే మొదలుపెట్టి తర్వాత అడుగుతారు. నేనేం చెప్పను నో అని ఆ నెంబర్ బ్లాక్ చేసేస్తా అని తెలిపారు.
