Aadarsha Kutumbam : అదరగొట్టిన ఆదర్శ కుటుంబం.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా..?
ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. (Aadarsha Kutumbam)
Aadarsha Kutumbam
AadarshaKutumbam : త్రివిక్రమ్ – వెంకటేష్ కాంబోలో తెరకెక్కిన ఆదర్శ కుటుంబం సినిమా ఇటీవల అక్టోబర్ 30న థియేటర్స్ లో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా నారా రోహిత్, నివేత పేతురేజ్, సత్య, యువిన పార్థవి, ప్రజ్వల్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు.
ఆదర్శ కుటుంబం సినిమా దసరాకి రావాల్సి ఉండగా వాయిదా పడి అక్టోబర్ 30 న వచ్చింది. అయినా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది ఈ సినిమా. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు క్రైమ్ కూడా జతచేసి త్రివిక్రమ్ కొత్తగా చూపించారు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు.
మొదటి రోజే 35 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఆదర్శ కుటుంబం సినిమా తాజాగా మూడు రోజులకు గాను 75 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆదర్శ కుటుంబం మూడు రోజుల కలెక్షన్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఈ వారంలో ఆదర్శ కుటుంబం సినిమా వంద కోట్ల గ్రాస్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

